
GHMC ఎన్నికల్లో భాగంగా చైతన్య పురి డివిజన్ లో ఓటర్లకు మద్యం బాటిల్స్ ను సరఫరా చేస్తున్న టీఆరెస్ నాయకులు , కార్యకర్తలను రెడ్ హ్యాండెడ్ గా స్థానికులు పట్టుకున్నారు. ప్రభాత్ నగర్ లోని ఓ ఇంట్లోని కారులో 21 మద్యం బాటిళ్లు…6 కాటన్ల ఖాళీ సీసాలు గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. ఆ బాటిల్స్ చైతన్యపరి టీఆరెస్ పార్టీ అభ్యర్థి జిన్నారం విఠల్ రెడ్డి కి సంబంధించినవిగా గుర్తించారు. లిక్కర్ సరఫరా విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ,TRS అభ్యర్థి జిన్నారం విఠల్ రెడ్డి పై కేసు నమోదు చేసి , డబ్బు , మద్యం పంపిణీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.