లిక్కర్ వ్యాన్ బోల్తా..

ఆంధ్ర ప్రదేశ్: డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది ఓ లిక్కర్ వ్యాన్. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ ఒంగోలు – నెల్లూరు హైవే పై జరిగింది. ఒంగోలు నుంచి నెల్లూరుకు వెళ్తున్న లిక్కర్ వ్యాన్… సింగరాయకొండ వద్ద అదుపుతప్పి  డివైడర్ ను ఢీకొంది. దీంతో వ్యాన్ బోల్తాపడగా లిక్కర్ బాటిల్స్ అన్నీ రోడ్డుపై పడిపోగా…  కొన్ని పగిలిపోయాయి. అటుగా వెళ్తున్న వాళ్లు దొరికింది దొరికినట్లు పట్టుకుపోయారు. అయితే వ్యాన్ లో చిక్కుకున్న వారిని స్థానికులు బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరుగలేదు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గాయాలైన వారిని హాస్పిటల్ కు తరలించారు. రోడ్డుపై పడివున్న బాటిల్స్ ను తీసేయించారు.

Latest Updates