క్రికెటర్ ఇంట్లో పేలిన సిలిండర్.. భార్యకు తీవ్ర గాయాలు 

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో భారీ పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో అతని భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచిత తీవ్రంగా గాయపడ్డారు. టీ పెట్టేందుకు స్టవ్ ఆన్ చేయగా సిలిండర్ పేలింది. కిచెన్ కేబినెట్ కూలడంతో ఆమె చేతులకు, ముఖానికి  గాయాలయ్యాయి. రెండు రోజుల ఈ ప్రమాదం జరిగింది. దీనిపై స్పందించిన దేవశ్రీ …చేతులను అడ్డం పెట్టుకోకపోతే  ముఖమంతా కాలిపోయేదని తెలిపింది.

2019 వరల్డ్ కప్ క్రికెట్ ముగిసిన తర్వాత దాస్, సంచిత పెళ్లి చేసుకున్నారు. కరోనాపై పోరాటం కోసం దాస్ బంగ్లా క్రికెట్ బోర్డు తనకిస్తున్న జీతాన్ని విరాళంగా ప్రకటించారు.

 

Latest Updates