వైర‌ల్ వీడియో : అమ్మ గ‌డుగ్గాయ్..పేరెంట్స్ పైనే ప్రాంక్

సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తుంటారు. కొందరు మరీ ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. తల్లిదండ్రులు ఏవో పనులమీద ఉన్నప్పుడు వారిని ఆపలేకపోవచ్చు. కొందరు పిల్లలు ఇంట్లో బుద్ధిగా ఉంటే..తెగ అల్లరి చేస్తుంటారు.

అదిగో అలా ఓ గ‌డుగ్గాయి ఇంట్లో చేసిన అల్ల‌రి సోష‌ల్ మీడియా వైర‌ల్ అవుతుంది. అది అల్ల‌రి అనేకంటే పేరెంట్స్ పై ప్రాంక్ చేసింది అంటే ఇంకా బాగుంటుంది.

సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి ఇంట్లో ఉన్న వాట‌ర్ బ‌బుల్ లో చేయి పెట్టి..మ‌మ్మీ..డాడీ నా చేయి వాట‌ర్ బ‌బుల్ లో ఇరుక్కుపోయిందంటూ కేక‌లు వేస్తుంది. కేక‌లు విన్న చిన్నారి నాన్న హ‌డావిడిగా వాట‌ర్ బ‌బుల్ లో ఇరుక్కున్న చేతిని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తాడు.

అంతే పేరెంట్స్ ను ప్రాంక్ చేస్తున్నట్లుగా వాట‌ర్ బ‌బుల్ లో ఉన్న చేతిని ఇట్టే బ‌య‌ట‌కు తీస్తుంది. ఆ స‌మ‌యంలో చిన్నారి ఎక్స్ ప్రెష‌న్స్ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

Latest Updates