పాండాల ఎన్‌ క్లోజర్‌ లో చిన్నారి

బీజింగ్‌ : పాండాల ఎన్‌ క్లోజర్‌ లో చిక్కుకున్న ఓ చిన్నారిని సెక్యూరిటీ గార్డ్స్ సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటన చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ లో శనివారం జరగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

చెంగ్డూ రీసెర్చ్‌ బేస్‌ దగ్గర పాండాలను  చూసేందుకు ఎనిమిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ప్రమాదవశాత్తూ ఆమె పాండాల ఎన్‌ క్లోజర్‌ లో పడిపోయింది. ఆ సమయంలో లోపల మూడు పాండాలు ఉన్నాయి. చిన్నారిని చూసిన పాండాలు మెల్లగా తన దగ్గరికి రావడంతో..చిన్నారి బెంబేలెత్తి పోయింది. విషయం తెలిసిన రక్షణా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు.

ఈ ఘటనను సిచువాన్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీ తీవ్రంగా పరిగణించింది. ‘పాండాలు పైకి కనిపించేంత సున్నితమైన జంతువులేమీ కావు. వాటి కాపలాదారులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదు’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిన్నారిని ప్రాణాలతో పైకి తీసుకువచ్చిన గార్డు లియూ గిహువాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Latest Updates