హైదరాబాద్‌‌లో లెజెండ్స్ లైవ్ కన్సర్ట్

ప్రముఖ సింగర్స్‌ కె.జె.జేసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , చిత్రల స్వర ఝరిలో హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది. ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘లైవ్ లెజెండ్స్ కాన్సర్ట్‌‌’ విజయవంతంగా జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇరవై మంది వాద్యబృందం సంగీతం అందించింది. గవర్నర్ తమిళి సై ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కార్యక్రమంలో శిఖా గోయల్ ఐపీఎస్, జయేశ్‌ రంజన్‌‌ ఐఏఎస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. ‘నాకు పాటలంటే చాలా ఇష్టం. మా నాన్న గారికి ఇంకా ఇష్టం . జేసుదాస్‌‌ గారు సంగీత ప్రపంచానికి దేవుడిచ్చిన వరం. బాలుగారి గాత్రంలో ఏ పాటయినా బాగుంటుంది. చిత్ర గారి స్వరం కోకిలలా ఉంటుంది’ అని గవర్నర్‌ అన్నారు.

Latest Updates