ఈ బాబును బతికించండి

మూడేళ్ల చిన్నారికి లివర్‌‌ డ్యామేజీ
దుబాయ్‌‌లో తండ్రి.. నిస్సహాయ స్థితిలో తల్లి
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌‌తోనే పునర్జన్మ
దొరకని దాతలు..ఆపరేషన్‌‌కు లక్షల్లో ఖర్చు
నీలోఫర్‌‌‌‌లో రోజులు లెక్కిస్తున్న మూడేళ్ల బాలుడు

ఈ బాబు పేరు తేజాన్ష్‌‌. వయసు మూడేళ్లు.. తల్లిదండ్రులు  జన్నారం మండలం చెర్లపల్లికి చెందిన గోలాడ లక్ష్మణ్​, రజిత. కూలీ పనులు చేసుకుని జీవించే ఈ కుటుంబానికి బాబు అనారోగ్యం రూపం లో పెద్ద ఆపద వచ్చి పడింది. తేజాన్ష్‌‌కు మూడు నెలల వయసులో లివర్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌ వచ్చింది. రూ.3 లక్షలు అప్పు చేసి ఆపరేషన్‌‌ చేయించారు. అయినా విధి వారిని వెంటాడుతూనే ఉంది. మూడేళ్లు తిరిగే సరికి తేజాన్ష్‌‌ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. హాస్పిటల్‌‌లో చూపిస్తే లివర్‌‌‌‌ డ్యామేజ్‌‌ అయిం దని, గతంలో చేసిన ఆపరేషన్‌‌ ఫెయిలైందని డాక్టర్లు చెప్పారు. బాబుకు వెంటనే లివర్​ట్రాన్స్​ప్లాంటేష న్ చేయాలన్నారు. సుమారు రూ.30లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. పది రోజుల్లో ఆపరేషన్ చేయకుంటే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

మంచిర్యాల, వెలుగు: ప్రస్తుతం హైదరాబాద్​ నీలోఫర్​ హాస్పిటల్‌‌లో తేజాన్ష్​ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కడుపు ఉబ్బిపోయింది. ఏమీ  తినడం లేదు. మాట్లాడలేకపోతున్నాడు. రోజురోజుకు పరిస్థితి విష మిస్తుండడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. బాలుడి బ్లడ్​గ్రూప్​ ఓ-నెగటివ్. అరుదైన ఈ గ్రూపు వారు కుటుంబంలో లేరు. దీంతో లివర్​ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సహాయం కోసం వేడుకుంటున్నారు.

ప్రాణభిక్ష పెట్టండి..

లక్ష్మణ్​కు ఆస్తిపాస్తులు లేవు. రోజూ కూలీ పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. దీంతో బాబు వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు లక్ష్మణ్​ ఏడాది క్రితం దుబాయ్ వెళ్లాడు. వీసా, ప్రయాణ చార్జీల కోసం మరో రూ.2లక్షలు అప్పయింది. ‘  కరోనాతో పని లేకుండా పోయింది. ఇక్కడ తిండికి తిప్పలయితుంది. వద్దామంటే విమానాలు నడుస్తలేవు. నా కొడుకు పరిస్థితి తెలిసి పానం కొట్టుకుంటుంది. నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా.. దయచేసి దాతలు స్పందించి నా కొడుక్కు ప్రాణభిక్ష పెట్టండి..’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఓ వీడియోను వాట్సప్‌‌లో పోస్ట్‌‌ చేశాడు.

బాబు బతకడం కష్టమంటున్నరు..

‘సార్​… నా బాబుకు చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్లు కూడా ఏమీ చేయలేమంటున్నారు. పది రోజుల్లో ఆపరేషన్​ చేయకుంటే బాబు బతకడంటున్నరు. దయచేసి ఎవరైనా డోనర్స్​ ముందుకు వచ్చి నా బిడ్డకు పునర్జన్మ ప్రసాదించండి..’ అంటూ రజిత కన్నీళ్లతో వేడుకుంటోంది. సోషల్​మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోల్లో ఆ దంపతులు కొడుకు కోసం ఎంతగా తపించిపోతున్నారో తెలుస్తోంది.

ట్విట్టర్‌‌లో కేటీఆర్ దృష్టికి..

తేజాన్ష్​ పరిస్థితిని శనివారం ట్విట్టర్​ ద్వారా మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లారు. వీడియోల ను పోస్ట్‌‌ చేసి తమ బిడ్డ ప్రాణం కాపాడాలని వేడుకున్నారు. వీరి వినతికి కేటీఆర్​ ఆఫీస్‌‌ స్పందించింది. పూర్తి వివరాలు పంపించాలని కోరిం ది. సర్కార్‌‌‌‌ తరఫున ఎంతో మంది పేదలను ఆదుకున్న కేటీఆర్ ​ తమనూ ఆదుకుంటారనే ఆశతో ఈ  దంపతులు ఎదురుచూస్తున్నారు.  దాతలు ఎవరైనా  96184 91173, 77020 50571 ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

 

Latest Updates