4 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి

వెలుగు: నాలుగు నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు అపోలో డాక్టర్లు. అపోలో లివర్ ట్రాన్స్ పెంటేషన్ విభాగం డాక్టర్ మనీష్ వర్మ మాట్లాడుతూ.. వైజాగ్ కు చెందిన గంగాధర్ సరోజ దంపతులకు నాలుగు నెలల క్రితం జన్మించిన చిన్నారి తరచూ అనారోగ్యానికి గురువుతోంది. దీంతో వైజాగ్​లో డాక్టర్లు పుట్టుకతోనే చిన్నారి కాలేయం నుంచి చిన్న పేగులను కలిపే పిత్తాశయ నాళం కుచించుకు పోయినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ కామెర్ల వ్యాధి ప్రమాదం తొలగిపోలేదు. చిన్నారి ఎదుగుదల ఆగిపోయింది. దీంతో జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ డాక్టర్లను చిన్నారి తల్లిదండ్రులు సంప్రదించారు. చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తప్పనిసరని గుర్తించారు. ఐతే 5 కిలోల బరువు, 6నెలలు కూడా నిండని చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహించటం రిస్క్ తో కూడుకున్న పని అయినా.. పాపను బతికించేందుకు పాప తల్లి సరోజ నుంచి లివర్ సేకరించి ఆపరేషన్ పూర్తిచేశామన్నారు. ప్రస్తుతం చిన్నారితో పాటు ఆమె తల్లికూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

Latest Updates