వైరల్ వీడియో: బీరులో పడిన బల్లికి నోటితో గాలి ఊది..

ఇంట్లో గోడలపై బల్లులు పాకుతుంటేనే చూసి భయపడేవాళ్లు కొందరుంటారు. ఆ బల్లిని తాకాలంటే ఛీ అనుకునే వాళ్లు, పొరబాటున అదే పైన పడితే దోషమని మూఢ నమ్మకాలు ఉండేవాళ్లకు కొదవే ఉండదు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బల్లిని పట్టుకుని, నీళ్లలో పడి ఊపిరాడని మనుషులకు చేసినట్లు సీపీఆర్ చేసి.. దాని నోట్లో నోరు పెట్టి.. గాలి ఊది ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌లో జరిగింది.

కోడిండి బీచ్ ప్రాంతంలోని ఓ పబ్‌లో ఒక వృద్ధుడు బీర్‌ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయన బీర్ జగ్గులో ఓ బల్లి పడింది. దాన్ని చూసి ముందుగా ఆయన దాన్ని రబ్బర్ బల్లి అనుకున్నాడు. ఆటపట్టించడానికి ఫ్రెండ్స్ అందులో వేశారని భావించాడు. కానీ అది గిలగిలా కొట్టుకోవడం చూసి నిజమైన బల్లే అని గుర్తించి.. చేత్తో బయటకి తీశాడు. ఆ బల్లిలో కదలిక లేకపోవడంతో దాన్ని బల్లపై పెట్టి.. పొట్టపై నొక్కి బీరు కక్కించాడు. ఆ తర్వాత గుండెపై తడుతూ సీపీఆర్ చేసి.. బల్లి నోట్లో నోరు పెట్టి గాలి ఊదాడు. దీంతో దాని ప్రాణం లేచి వచ్చింది. ఆ వృద్ధుడి చేతులపైనే కదులుతూ ఆడుకో సాగింది. భయపడి పారిపోవడం మానేసి ఆయన చొక్కపై పాకుతూ ఉండిపోయింది. అది ఆయనకి మంచి ఫ్రెండ్‌లా మచ్చిక కావడంతో దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Latest Updates