పోటీకి అద్వానీ గుడ్ బై!

న్యూఢిల్లీ: గుజరాత్‌ లోనిగాం ధీనగర్‌ తో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.కె.అద్వానీకి రాజకీయ బంధం దాదాపు తెగిపోయినట్టే. 1991 నుం చి ఇక్కడ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నుంచి గెలుస్తున్న అద్వానీకి ఈసారి టిక్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కే అవకాశం లేదని   తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని బీజేపీ నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమిత్‌ షాపై గాంధీనగర్‌ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు  92 ఏళ్ల  అద్వానీ స్వచ్ఛందంగానే పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గాంధీనగర్‌ సీటు తనకు కేటాయించాలంటూ ‘సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ’కి ప్రతిపాదనలు పంపాలని అహ్మదా బాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన ఆఫీసుకు అద్వానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. గాంధీనగర్‌లో అద్వానీ స్థానంలో ఎవర్ని నియమించాలన్నదాని పై బీజేపీ హైకమాండ్‌ ఇప్పటికే చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. పార్టీకి చెందిన జాతీయస్థాయి నాయకుడు ఒకరు ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశముందని తెలుస్తోంది.

బీజేపీకి గాంధీనగర్‌ మంచిపట్టున్న నియోజకవర్గం కావడంతో గెలుపు కోసం పెద్దగా శ్రమపడాల్సి న అవసరం ఉండదు. ఒకవేళ జాతీయస్థాయి నాయకుడు ఎవరూ ఇక్కడి నుంచి పోటీచేయకుంటే .. ఓబీసీ, పటీదార్‌ , బ్రాహ్మణుల్లో ఒకరికి ఈ టి కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అద్వానీ మార్పు పై మాత్రం ఇంత వరకు తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు చెప్పారు.ప్రత్యర్థి ఎవరైనా గెలుపు అద్వానీదే గాంధీనగర్‌ నుంచి అద్వానీ ఆరుసార్లు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభకు ఎన్నికయ్యారు. ప్రతిసారీ ఆయన భారీ మెజార్టీతో ఇక్కడ గెలుస్తున్నారు. 2014 వరకు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో గుజరాత్‌ నుంచి ఎక్కువ మెజార్టీతో గెలిచిన రికార్డు ఆయనకు ఉంది. 1998లో 2.77 లక్షల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. గాంధీనగర్‌లో అద్వానీపై పోటీచేయడానికి ఎవరూ సాహసించరు. ఒకవేళ ధైర్యం చేసి పోటికి దిగినా  ప్రత్యర్థి గెలవడం అసాధ్యం . ఎలాగైనా బీజేపీ కురువృద్ధుడిపై గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నోసార్లు , ఎంతోమంది అభ్యర్థుల్ని మార్చినా ఇక్కడ వారు గెలవలేకపోయారు. వాళ్లేకాదు దేశంలో పేరున్న ఇండిపెండెంట్‌‌ కేండిడేట్లు కూడా అద్వానీపై పోటీచేసి ఓటమిని మూటగట్టుకున్నారు. అలాంటి వారిలో మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌ టి .ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.శేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సామాజిక ఉద్యమనేత, శాస్త్రీయ నృత్యకారిణి మల్లికా సారాభాయ్‌ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. 2014 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్‌ నుం చి సుమారు రెండు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచినా..ఐదేళ్లలో చుట్టం చూపుగా తప్ప నియోజకవర్గాన్ని సందర్శించిందిలేదని స్థానికులు చెబుతారు.

Latest Updates