సిబిల్ డేటా చోరీ.. ఫ్లిప్ కార్ట్, ముత్తూట్ ఫైనాన్స్ లో లోన్లు

తన వ్యక్తిగత సమాచారంతో ఫ్లిప్ కార్ట్ , IDFC ఫస్ట్ బ్యాంక్ , ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలు  మోసాలకు పాల్పడ్డాయంటూ హైదరాబాద్ కు చెందిన ఓ లాయర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబిల్ డేటాలో ఉన్న తన వివరాలను సేకరించి.. ఫ్లిప్ కార్ట్ , IDFC ఫస్ట్ బ్యాంక్ , ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలు తన పేరుతో లోన్ తీసుకుని..చెల్లించనట్లుగా ఉన్నాయని తెలిపారు. లాయర్ ఫిర్యాదుతో .. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు

తాడ్ బండ్ ప్రాంతానికి చెందిన న్యాయవాది మహ్మద్ బర్కత్ అలీ ఇటీవల సైబర్ మోసాలపై వస్తున్న కథనాలతో ..తన వ్యక్తిగత వివరాలు సురక్షితంగా ఉన్నాయా.. లేదా… అనే అనుమానం వచ్చిందని తెపారు . దీనితో ట్రాన్స్ యూనియన్ సిబిల్ లిమిటెడ్ వెబ్ సైటు ను ఓపెన్ చేశానన్నారు. అయితే తన పేరు పై లోన్లు ఉండటాన్ని షాక్ అయ్యానని తెలిపారు. అందులో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ నుండి తన పేరుపై లోన్ తీసుకొని , చెల్లించినట్లు నమోదయ్యిందన్నారు. మరో యక్టీవ్ లోన్ రూ.60 వేలు IDFC ఫస్ట్ బ్యాంక్ నుండి తీసుకున్నట్లు ఉందన్నారు. IDFC ఫస్ట్ బ్యాంక్ కు అనుబంద సంస్థగా ఉన్న ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సంస్థలో తన పేరుపై లోన్ మంజూరైనట్లు ఉందని తెలిపారు న్యాయవాది మహ్మద్ బర్కత్. దీనితో సంబంధిత IDFC ఫస్ట్ బ్యాంక్ యాజమాన్యానికి , సిబిల్ యాజమాన్యానికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో… సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించానని చెప్పారు.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం నిక్షిప్తమయ్యే సిబిల్ సంస్థ నిర్లక్ష్యంతో ఇలాంటి మోసాలు జరగడం ప్రమాదకరమన్నారు మహ్మద్. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సిబిల్ వ్యవహారాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. సిబిల్ తో సహా IDFC ఫస్ట్ బ్యాంక్ , ముత్తూట్ ఫైనాన్స్ , ఫ్లిప్ కార్డ్ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Latest Updates