స్థానిక సంస్థల MLC ఎన్నికలకు EC గ్రీన్ సిగ్నల్

  • ఇవాళ నోటిఫికేషన్

రాష్ట్రంలో స్థానిక సంస్థల MLC ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ స్థానిక సంస్థలకు బై ఎలక్షన్ జరగనుంది.

వరంగల్ లో కొండా మురళి, రంగారెడ్డి నుంచి పట్నం నరేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. మూడు శాసనమండలి స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది.

మే 14వరకు నామినేషన్ల దాఖలుకు టైమ్ ఇచ్చారు. 15న నామినేషన్ల పరిశీలన, 17న విత్ డ్రా, ఈ నెల 31న ఎన్నికలు జరపనున్నారు. మే నెలాఖరున ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

MLC ఎన్నికల ఫలితాలు జూన్ 3న ప్రకటిస్తారు.

Latest Updates