పాపులర్‌‌‌‌ అవుతున్న లోకల్ ఓటీటీలు.. నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, అమెజాన్‌‌‌‌ప్రైమ్‌లకు పోటీ

నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, అమెజాన్‌‌‌‌ప్రైమ్‌‌‌‌ షోలకు పోటీ

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ చివరి వారంలో టాప్‌‌‌‌ షోలలో స్కామ్‌‌‌‌ 1992, ఆశ్రమ్‌‌‌‌

ప్రైమ్‌‌‌‌ షో మీర్జాపుర్‌‌‌‌‌‌‌‌2

లోకల్‌‌‌‌ ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు పెరుగుతున్న  డిమాండ్‌‌‌‌

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశంలో ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ వాడకం విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో కొన్నేళ్లలో చేరుకోవాల్సిన డిమాండ్‌‌‌‌ను, ఓటీటీ కంపెనీలు కొన్ని నెలల్లోనే చేరుకున్నాయి. ప్రస్తుతం నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, అమెజాన్ ప్రైమ్‌‌‌‌ వంటి ఇంటర్నేషనల్‌‌‌‌ ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకే కాకుండా సోనిలైవ్‌‌‌‌, ఎంఎక్స్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, జీ5 వంటి ఇండియన్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. వీడియో స్ట్రీమింగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను ట్రాక్‌‌‌‌ చేసే ఓర్మక్స్‌‌‌‌ మీడియా మూవీ పోర్టల్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ కంపానియన్‌‌‌‌తో కలిసి దేశంలో ఎక్కువగా చూస్తున్న ఓటీటీ షోలను బయటపెట్టింది. అక్టోబర్ చివరి వారంలో ఎక్కువగా చూసిన షోలలో  మీర్జాపుర్‌‌‌‌‌‌‌‌2(1.68 కోట్లు వ్యూస్‌‌‌‌) టాప్‌‌‌‌లో ఉంది. అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌లో ఈ షో వస్తోంది. దీని తర్వాత సోనీ లైవ్‌‌‌‌ షో స్కామ్‌‌‌‌ 1992: ది హర్షద్‌‌‌‌ మెహతా స్టోరీ(60 లక్షలు వ్యూస్‌‌‌‌), ఎంఎక్స్ ప్లేయర్‌‌‌‌  హై (23 లక్షలు), ఆశ్రమ్‌‌‌‌(22 లక్షలు) షోలు ముందున్నాయి. జీ5 షో తైష్‌‌‌‌ కూడా మంచి వ్యూస్ ఉన్నాయని ఓర్మక్స్‌‌‌‌ పేర్కొంది.

లోకల్‌‌‌‌ ఓటీటీలలో పెరుగుతున్న కంటెంట్‌‌‌‌

క్వాలిటీ కంటెంట్‌‌‌‌లకు పెరుగుతున్న  వ్యూస్‌‌‌‌ నిదర్శనమని ఎంఎక్స్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సీఈఓ కరన్‌‌‌‌ బేడి అన్నారు. అన్ని ఓటీటీ సర్వీస్‌‌‌‌లకు మంచి అవకాశాలున్నాయని, కానీ అందరూ వీటిని వాడుకోలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆడియన్స్‌‌‌‌ను చేరుకోవడానికి అనుసరించాల్సిన స్ట్రాటజీల గురించి గత కొన్ని నెలల నుంచి నేర్చుకుంటున్నామని అన్నారు. దేశంలోని యూజర్లను చేరుకోవడంలో ఇంటర్నేషనల్ ఓటీటీలతో పోల్చుకుంటే ఇండియన్ ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు అడ్వాంటేజ్‌‌‌‌ ఉంటుందని టోనిక్ వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ చేతన్‌‌‌‌ ఆషర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇండియాలోని కన్జూమర్లను ఈ ఓటీటీలు ఎక్కువగా అర్థం చేసుకోగలవని చెప్పారు. లోకల్ కంటెంట్‌‌‌‌కు ఎక్కువగా డిమాండ్‌‌‌‌ ఉంటుందని బేడి అన్నారు. ‘కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో కొన్ని నెలల్లోనే ఇండియాలో ఓటీటీలు ఎక్కువగా విస్తరించగలిగాయి. మొదటి సారిగా కంటెంట్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ కంటే వినియోగం ఎక్కువగా ఉంది’ అని మీడియాకామ్‌‌‌‌ సీనియర్ డైరక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌ సోన్‌‌‌‌పర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. స్మార్ట్‌‌‌‌ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో ఉండడం, డేటా కాస్ట్‌‌‌‌ తక్కువగా ఉండడంతో ఓటీటీలు ఇంతలా విస్తరించగలిగాయని చెప్పారు. కన్జూమర్ల ప్రిఫరెన్స్‌‌‌‌లను ఎమర్జింగ్‌‌‌‌ ఓటీటీలు బాగా అర్థం చేసుకుంటున్నాయని దీపక్ అన్నారు. ఎంఎక్స్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ షో ఆశ్రమ్‌‌‌‌ లేదా సోనిలైవ్‌‌‌‌ షో స్కామ్‌‌‌‌ 1992, నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌ షో ‘సాక్రెడ్‌‌‌‌ గేమ్స్‌‌‌‌’ లా పాపులర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయని అన్నారు. ‘స్కామ్‌‌‌‌ 1992 పరిశీలిస్తే ఈ షోలో హింస లేదా అడల్ట్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ లేదు. షో ని బాగా తెరకెక్కించారు. ఈ షో నచ్చిందని మా ఎనాలసిస్‌‌‌‌లో యూజర్లు చెప్పారు.  ఈ షో కంటెంట్‌‌‌‌ కేవలం టార్గెట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ను చేరుకోవడమే కాకుండా, రిలీజ్‌‌‌‌ కూడా మంచి టైమింగ్‌‌‌‌లో జరిగింది’ అని దీపక్ అన్నారు.  ఇండియన్‌‌‌‌ ఓటీటీలకు డిమాండ్ పెరుగుతున్నా.. ఇంటర్నేషనల్‌‌‌‌ ఓటీటీలకే అడ్వాంటేజ్‌‌‌‌ ఎక్కువగా ఉందని  ఇండిపెండెంట్‌‌‌‌ డిజిటల్‌‌‌‌ ఏజెన్సీ సోచీర్స్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ మెహుల్‌‌‌‌ గుప్తా అన్నారు. ఈ ఓటీటీల వద్ద కంటెంట్ ఎక్కువగా ఉండడంతో పాటు, వ్యూయర్స్ ఎక్కువగా దేనిని చూస్తున్నారో వీరి దగ్గర డేటా ఉందని చెప్పుకొచ్చారు. ఎంఎక్స్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, సోనీలైవ్‌‌‌‌ వంటి లోకల్‌‌‌‌ ఓటీటీలు కొత్త కంటెంట్‌‌‌‌లను ఎప్పటికప్పుడు తెస్తున్నాయని అన్నారు. కానీ ఇండియాలో షో లేదా ఫిల్మ్  సక్సెస్‌‌‌‌ కావడంలో  వర్డ్‌‌‌‌ ఆఫ్ మౌత్‌‌‌‌(ఒకరి నుంచి ఒకరికి తెలియడం) చాలా కీలకంగా ఉంటోందని  పేర్కొన్నారు.

For More News..

సర్కారీ చదువు.. సక్కగ లేదు

ఉపఎన్నికల్లో సెంటిమెంట్‌‌‌‌ పన్జేయట్లే..

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..

Latest Updates