బతుకమ్మ చీరలొద్దు.. డ్రైనేజీ క్లీన్​ చేయించండి

బతుకమ్మ చీరలొద్దు.. డ్రైనేజీ క్లీన్​ చేయించండి

ఎమ్మెల్యేకు మహిళల వినతి
ఖానాపూర్, వెలుగు: తమకు బతుకమ్మ చీరలు వద్దని.. గ్రామంలోని మురుగు కాల్వలను క్లీన్​చేయిస్తే చాలని నిర్మల్​ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ మహిళలు డిమాండ్​చేశారు. బుధవారం బతుకమ్మ చీరలు పంచేందుకు కొండుకూర్​ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే రేఖానాయక్ తో స్థానిక మహిళలు డ్రైనేజీ సమస్య చెప్పుకొని వాపోయారు. కొంత కాలంగా మురుగు కాల్వలు క్లీన్​చేయడం లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు మురుగు నీరు రోడ్లపై పారుతున్నా సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మురుగు కాల్వలు క్లీన్​చేయించే వరకు చీరల పంపిణీ ఆపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రేఖ మహిళలకు సర్దిచెప్పి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు.