మహారాష్ట్రలో ఇంకొన్ని రోజులు లాక్ డౌన్

ముంబై: రాష్ట్రంలోని కంటైన్ మెంట్ జోన్లలో ఈ నెల 30 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగుతుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. లాక్ డౌన్ రూల్స్ సడలిస్తున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు రావడంతో ఆయన క్లారి టీ ఇచ్చారు. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని, లాక్ డౌన్ ఎత్తేయబోమని థాక్రే ఆదివారం మీడియాతో అన్నా రు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేం దుకు ‘మిషన్ బిగిన్ అగైన్’ గా పిలుస్తున్న అన్ లాక్ ను క్రమంగా అమలు చేస్తామన్నారు. ‘చేజ్ ది వైరస్’ ప్రోగ్రామ్ మంచి ఫలితాలివ్వడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. పేదలకు అగ్గువ ధరకే ఆహార ధాన్యాలు సప్లై చేసే పీఎం గరీబ్ కల్యాణ్ యోజనను రాష్ట్రంలో కంటిన్యూ చేయాలని ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు.

Latest Updates