క్రేజీ కాంటెస్ట్​లు..లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్, వెలుగు:లాక్​డౌన్​తో ఇంట్లో ఉన్న జనానికి స్మార్ట్ ఫోన్, సోషల్​యాప్సే ఇప్పుడు ఎంటర్​టైన్​మెంట్​గా మారాయి. సోషల్​ మీడియాలో రోజుకో చాలెంజ్ పుట్టుకొస్తున్నట్టే, కొత్తగా కాంటెస్ట్​లూ స్టార్ట్ ​అయ్యాయి. పార్టిసిపేట్ ​చేసేందుకు సిటిజన్స్ కూడా  ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

పోటీలు పెట్టి.. ఫ్రైజ్​ మనీ ఇస్తున్రు

నెల రోజులుగా ఇంట్లోనే ఉంటూ బోర్ ఫీల్​ అవుతున్నవాళ్లకు ఈ కాంటెస్ట్ లు మంచి టైం పాస్​గా మారాయి. ఇన్ స్టాగ్రామ్​లో నిర్వాహకులు పదుల సంఖ్యలో కాంటెస్ట్ పేజీలు క్రియేట్ చేస్తున్నారు. సూపర్​ బేబీస్ నుంచి కపుల్ కాంటెస్ట్ వరకూ, బుజ్జి బుజ్జి కుక్క పిల్లల నుంచి బెస్ట్ ఆర్టిస్ట్ దాంకా పలు పోటీలు నిర్వహిస్తున్నారు. పార్టిసిపెట్ చేయాలనుకునే వారికి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ఉండాలి. ఎవరైతే కండెక్ట్ చేస్తున్నారో ఆ క్రియేటర్ పేజీని ఫాలో అవ్వాలి. అకౌంట్ కి కంటెస్టెంట్ల ఫొటో, డీటెయిల్స్ షేర్ చేయాలి. ఎంట్రీ ఫీ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వారు గెలిచినట్లు లెక్క. విన్నర్, రన్నరప్ ​నేమ్స్ మెన్షన్ చేసి ప్రైజ్​మనీ ఆన్లైన్​లో సెండ్​ చేస్తున్నారు కాంటెస్ట్ క్రియేటర్స్.

పెరుగుతున్న ఇంట్రస్ట్

ఉన్నచోటు నుంచే పోటీలో పాల్గొనే చాన్స్​ ఉండడం.. టైంపాస్​తోపాటు మనీ సంపాదించే వీలూ ఉండడంతో చాలామంది పాల్గొంటున్నారు. క్వారంటైన్​ పెట్స్ కాంటెస్ట్ లో పాల్గొన్న పెట్స్ కి రూ.700 నుంచి రూ.100 వరకు 5 ప్రైజ్​మనీలు మెన్షన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన కాంటెస్ట్ లో దాదాపు 150 మంది తమ పెట్స్ తో పాల్గొన్నారు. నిర్వాహకులు 5 రోజులపాటు ఎంట్రీలు తీసుకుంటారు. పప్పి నేమ్, ఓనర్ నేమ్, కంటెస్టెంట్ నంబర్ మెన్షన్ చేస్తారు. తర్వాత 5 రోజుల్లో వచ్చిన లైక్స్​ని బట్టి విన్నర్స్​ని డిసైడ్​చేశారు. బేబీ కాంటెస్ట్ 2020లో ఐదేండ్లలోపు పిల్లలకు కాంపి టీషన్ నిర్వహించారు. గెలిచిన వారికి ఫొటో ఫ్రేమ్, సెకండ్ విన్నర్ కి మొబైల్ కేస్ పై ఫొటో ప్రింట్ చేసి ఇచ్చారు. కవులు, బెస్ట్ ఆర్టిస్ట్ పోటీల్లో గెలిచిన వారికి రూ.1000 నుంచి రూ.500 ప్రైజ్ మనీ అనౌన్స్​ చేస్తున్నారు. కపుల్స్ కోసం కపుల్ కాంటెస్ట్ 2020, పెన్సిల్ ఆర్ట్ చేసే వారి కోసం బెస్ట్ క్వారంటైన్​ ఆర్టిస్ట్ కాంటెస్ట్ ఇలా రకరకాల పోటీలు జరుగుతున్నాయి.

చాలా హ్యాపీగా అనిపించింది

నా ఫ్రెండ్​ ద్వారా బేబీ కాంటెస్ట్ గురించి తెలుసుకున్నా. మా బాబు పేరు వివన్ వర్మ(3). సరదాగా ట్రై చేద్దామని ఫొటో పంపాం. ఓ వెయ్యి లైక్స్ రాకపోతాయా అనుకున్నాం. 7 వేలు దాటిపోయాయి. చాలామంది పర్సనల్ గా మావాడి ఫొటోని తమ అకౌంట్స్ లో పెట్టుకున్నారు. 200 మందిలో వినయ్ విన్నర్ అవడం హ్యాపీగా అనిపించింది. చాలా మంది ఫోన్స్​చేసి కంగ్రాట్స్ చెప్పారు.

– రమ్యవర్మ, బేబీ కాంటెస్ట్​ విన్నర్​ మదర్

లాక్​డౌన్​లో క్రియేటివ్ గా

నేను హౌజ్ వైఫ్​ని. లాక్ డౌన్​లో ఖాళీగా ఉండే బదులు ఏదైనా క్రియేటివ్ గా చేద్దామనిపించింది. మాది భీమవరం. మా ఊళ్లోని ఐదేండ్లలోపు పిల్లలందరినీ ఒక పేజీలో చూడాలని అనిపించింది. అందుకే బేబీ కాంటెస్ట్ ని క్రియేట్ చేశా. మొదట 200 ఎంట్రీలు ఫ్రీగా తీసుకున్నాం. అందులో ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తే వారిని విన్నర్ గా ప్రకటించి, ఆ తర్వాతి స్థానంలో ఉన్నవారికి సెకండ్, థర్డ్ ప్రైజ్​లు ఇచ్చాం.

‑ పద్మావతి మంతెన,

బేబీ కాంటెస్ట్ క్రియేటర్కపుల్స్ కి ఇదొక మెమరీ

ఏ సోషల్ యాప్ లో చూసినా కపుల్ గోల్స్ హ్యాష్ ట్యాగ్ తో ఫొటోలు కనిపిస్తున్నాయి. అందుకే క్వారంటైన్ లోని కపుల్స్ కాంటెస్ట్ పెడితే బాగుంటుందనిపించింది. భార్యాభర్తలకు ఇదొక మంచి మెమరీలా ఉంటుంది. ఇప్పటివరకు 25 ఎంట్రీలు వచ్చాయి. ఎక్కువ లైక్స్ వచ్చిన వారిని విన్నర్స్​గా ప్రకటించి ప్రైజ్​మనీ ఇస్తాం.

– మౌనిక సాగిరాజు,కపుల్స్ కాంటెస్ట్ క్రియేటర్

Latest Updates