రాష్ట్రంలో జూలై 31 వ‌ర‌కు లాక్ డౌన్ పొడ‌గింపు

తెలంగాణలో లాక్ డౌన్ ను జూలై 31వ తేదీ వరకు పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త లాక్ డౌన్ కు నూతన మార్గదర్శకాలను బుధ‌వారం జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొన‌సాగ‌నుండ‌గా..మెడికల్ ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునిచ్చింది.

రాత్రి 9.30 గంటల లోపు అన్ని షాపులు మూసేయాలని..రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంద‌ని చెప్పింది. హైదరాబాదు కంటోన్మైంట్ జోన్లలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలిచ్చింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం