దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 4 గడువు రేపటి(ఆదివారం, మే-31)తో ముగియనుంది. దీంతో మరో 30 రోజులు లాక్ డౌన్ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటలనుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది. అయితే కంటైన్మెంట్లు జోన్లు మినహా ..మిగిలిన జోన్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఉంటాయని తెలిపింది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్ తెరుచుకోడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చింది.  సినిమాహాల్స్, జిమ్ లు,స్విమ్మింగ్ పూల్స్, పార్క్ లు, బార్లకు అనుమతివ్వలేదు. ఇక స్కూళ్లు, కాలేజీలు,విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇచ్చింది.

మరోవైపు పరిస్థితిని బట్టి మెట్రో రైలు సర్వీసులు, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు చెప్పిన కేంద్రం… రాష్ట్రాల మధ్య రవాణకు అంక్షలు లేవని చెప్పింది.

Latest Updates