ప్రపంచ వ్యాప్తంగా రిక్వెస్ట్..150మంది పిల్లలకు జన్మనిచ్చిన జోయ్

జోయ్ కి ఇప్పటి వరకు 150మంది పిల్లలకు తండ్రయ్యాడు. సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న మహిళలకు స్పెర్మ్ దానం చేస్తూ వారికి అమ్మతనాన్ని అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఏకంగా ఏడాదికి కనీసం 10 మంది ఆడవాళ్లను గర్భవతుల్ని చేశాడు.  ఇప్పటికే 150 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పిన జోయ్.. లాక్ డౌన్ దెబ్బకు ప్రపంచమంతా స్థంభించినా…తాను మాత్రం అర్జెంటైనాలో అదే పనిలో బిజీగా ఉన్నట్లు చెప్పాడు.

అమెరికాకు చెందిన జోయ్ స్పెర్మ్ డోనర్. స్పెర్మ్ డొనేట్ చేస్తే ఆ వివరాల్ని రహస్యంగా ఉంచాలి. కానీ జోయ్ అలా చేయడం లేదు.  2008నుంచి ప్రారంభమైన స్పెర్మ్ దానం నిర్విరామంగా కొనసాగుతుంది.  ప్రస్తుతం ఐదుగురు మహిళలు తన బిడ్డలను మోస్తున్నట్లు మీడియా సంస్థ మిర్రర్ కు తెలిపారు.

తనకు ప్రపంచ దేశాల నుంచి సోషల్ మీడియా ద్వారా అనేక మంది సంతానలేమి సమస్యతో బాధపడేవారు తనని సంప్రదిస్తారని..అలా స్పెర్మ్ దానం చేస్తున్నట్లు చెప్పాడు. “నేను 2500 కన్నా ఎక్కువ మందికి తండ్రిని అవుతానని చెప్పలేను. ఎందుకంటే నేను 250సంవత్సరాలు బ్రతకడం అసాధ్యం.. స్పెర్మ్ పనిచేసేంత వరకు దానం చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.

Latest Updates