క్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ కు బ్యాంకుల కోత

ముంబైఒకవైపు ఉద్యోగాల కోత.. మరోవైపు జీతాల తగ్గింపుతో వేతన జీవులు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు బయట డబ్బులు కూడా దొరకడం లేదు. కొన్ని బ్యాంక్‌‌‌‌లు ఇప్పటికే తమ క్రెడిట్ కార్డుల లిమిట్‌‌‌‌ను తగ్గించేస్తున్నాయి. మరికొన్ని బ్యాంక్‌‌‌‌లు పర్సనల్ లోన్ లిమిట్స్‌‌‌‌ కు కోత పెడుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. వారి లోన్ సీలింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నల్ మెమో ప్రకారం.. 2 లక్షల మంది కస్టమర్ల క్రెడిట్ కార్డు లిమిట్‌‌‌‌ను ఈ నెల 15 నుంచి తగ్గించినట్టు తెలిసింది. ఈ విషయాన్నే కొంత మంది యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు కూడా ధృవీకరించారు. క్రెడిట్ లిమిట్స్ ను 30 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గించినట్టు పేర్కొన్నారు. ‘నా యాక్సిస్ బ్యాంక్ విస్తారా కార్డు క్రెడిట్ లిమిట్‌‌‌‌ను రూ.5 లక్షల నుంచి రూ.50 వేలకు తగ్గించారు.
నేను బకాయిలు సరియైన సమయానికి చెల్లిస్తున్నా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం కస్టమర్ కేర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేస్తే… సాంకేతిక లోపమని, కొన్ని రోజుల్లో పరిష్కరిస్తామని చెబుతున్నారు’ అని ఓ కస్టమర్ చెప్పారు. మరో కస్టమర్ కూడా తన క్రెడిట్ కార్డు లిమిట్‌‌‌‌ను రూ.7 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు తగ్గించినట్టు పేర్కొన్నారు. కార్డుల జారీలో యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ షేరు 12.6 శాతంగా ఉంది.

కోటక్​ కస్టమర్లకు ఇదే పరిస్థితి…

కొంతమంది కోటక్​ మహింద్రా బ్యాంక్ కస్టమర్లకు కూడా క్రెడిట్ కార్డుల లిమిట్‌‌‌‌ను తగ్గించినట్టు తెలిసింది. ‘నా క్రెడిట్ కార్డు లిమిట్‌‌‌‌ను రూ.75 వేల నుంచి రూ.44 వేలకు తగ్గించారు. రెగ్యులర్ అకౌంట్ రివ్యూ ప్రాసెస్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు’ అని కోటక్​ మహింద్రా బ్యాంక్‌‌‌‌కు చెందిన ఓ కస్టమర్ తెలిపారు.  రొటీన్ కార్యక్రమంలో భాగంగా లిమిట్  తగ్గించినట్టు ఈ బ్యాంకు తెలిపింది. ‘క్రెడిట్ విలువను, క్రెడిట్ కార్డు హోల్డర్ల కార్డు ఖర్చులను ఎనాలసిస్ చేయడం ఎప్పుడూ జరిగేదే. ఇదే పిరియడ్‌‌‌‌లో చేపట్టే ప్రత్యేకమైన చర్య కాదు’ అని తెలిపింది.  .

క్రెడిట్ కార్డుల లోన్స్ విలువరూ.1.1 లక్షల కోట్లు...

ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ డేటా ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి క్రెడిట్ కార్డుల అవుట్‌‌‌‌స్టాండింగ్ అమౌంట్ ఆల్‌‌‌‌ టైమ్ హైలో రూ.1.1 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 26 శాతం పెరిగింది. జనవరి చివరి నాటికి ఇండియాలో యాక్టివ్ క్రెడిట్ కార్డులు 5.6 కోట్లుగా ఉన్నాయి.

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ కూడా అదే బాట

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌ కూడా కేవలం గ్రోసరీ స్టోర్లకు, ఫార్మసీలకు, ఇతర డయిరీలకు మాత్రమే లోన్స్ ఇస్తోం ది. తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇదే విషయంపై  యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌‌‌ డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌లను సంప్రదించ గా.. సమాధానం ఇవ్వలేదు. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ పర్సనల్ లోన్స్ కు అర్హతను కఠినతరం చేసి, లిమిట్స్ ను తగ్గించేసింది. బ్యాంక్ అన్‌‌‌‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్ పోర్ట్‌‌‌‌ ఫోలియోలలో 80  శాతం వేతన జీవులే ఉన్నారు. బిజినెస్ లోన్లకు ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్‌‌‌‌ సంఖ్యను పెంచింది. అంటే అప్లికెంట్ ఫైల్ చేసే మినిమమ్ ఇయర్స్ ను పెంచింది.

Latest Updates