సెప్టెంబర్ 5 వరకు అన్ని కోర్టుల్లో లాక్ డౌన్

హైదరాబాద్, వెలుగు: కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాష్ట్రంలోని కోర్టుల్లో రోజువారీ విధులను సెప్టెంబర్‌ 5 వరకు నిలిపివేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టుతోపాటు అన్ని సబార్నేట్‌డి కోర్టులకు లాక్‌‌డౌన్‌ పొడిగించింది. పిల్స్, బెయిల్స్, నిర్మాణాల కూల్చివేతల ఉత్తర్వులు, స్టేపిటిషన్లు వంటి అత్యవసర కేసులతో పాటుపెండింగ్‌లో ఉన్న అడ్మిషన్‌మేటర్స్, తుది విచారణలో ఉన్న వ్యాజ్యాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాలని సూచించినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డితెలిపారు. ఆన్‌లైన్‌లో పిటిషన్లతో పాటు నేరుగా హైకోర్టులో నూ పిటిషన్లను లాయర్లు వేసుకోవచ్చన్నారు.

Latest Updates