ఢిల్లీలో లాక్ డౌన్: ఇళ్లకే పరిమితమైన 90 శాతం ప్రజలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు దిట్టంగా అమలు చేస్తున్నారు. అత్యవసర అవసరాలకోసం వచ్చే ప్రజలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్నారు పోలీసులు. దీంతో చాలా మంది జనం ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో 90 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎలాంటి అవసరం లేకుండానే  రోడ్లపైకి వచ్చిన ప్రజలను హెచ్చరించి తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. వాహానాలను తనిఖీలు చేసి అవసరం అనుకుంటేనే అనుమతి ఇస్తున్నారు పోలీసులు. కేవలం మీడియా, పోలీసులు, డాక్టర్స్, బ్యాంక్ వర్కర్స్, కరమ్ చారీ వర్కర్స్ కు  మాత్రమే బయటకు రావడానికి అనుమతి ఉంది.మిగతా వారికి పోలీసులు పర్మిషన్ లెటర్ ఉంటేనే సిటీ లోపలికి రానిస్తున్నారు. కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ..తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైకుల ద్వారా సూచిస్తున్నారు పోలీసులు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దని అలర్ట్ చేస్తున్నారు.

Latest Updates