యూపీలో రాత్రికి రాత్రే మొదలైన లాక్డౌన్

ఉత్తరప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో అకస్మాత్తుగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త లాక్డౌన్ విధించారు. కరోనా తీవ్రత దృష్ట్యా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. అవసరంలేని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, అవసరం లేని వస్తు సముదాయాలు, మాల్స్ మరియు రెస్టారెంట్లు మూసివేయబడతాయని కూడా తెలిపింది. బస్సులు మరియు ఇతర ప్రజా రవాణా కూడా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. యూపీ నుంచి బయటకు రైళ్లు వెళ్లవు కానీ.. బయట నుంచి యూపీకి వచ్చే రైళ్లు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. వాటిలో వచ్చే ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలు చేరడం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అన్నీ అనుకూలిస్తే సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు లాక్‌డౌన్ ఎత్తివేయబడుతుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని కర్మాగారాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది. అంతేకాకుండా.. రోడ్లు, హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల పనులు కూడా జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం మే నెలలో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో ప్రభుత్వం కంటేయిన్ మెంట్ ప్రాంతాలలో అదనపు ఆంక్షలను అమలు చేసింది. ఘజియాబాద్ మరియు నోయిడా వద్ద ఢిల్లీతో ఉన్న సరిహద్దులను మూసివేసింది. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటివరకు 30,000కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 20,000 మందికి పైగా రోగులు కోలుకోగా.. 845 మంది రోగులు మరణించారు.

కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర మంత్రి అమిత్ షా గత వారం ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కరోనా పరీక్షలపై దృష్టి పెట్టాలని అమిత్ షా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ‘వన్ మహోత్సవ్’ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. సోషల్ డిస్టెన్స్ పాటించి ఎంత పెద్ద కార్యక్రమాలైన నిర్వహించవచ్చని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.

For More News..

డాక్టర్ ప్రాక్టీస్ కోసమూ ఎంట్రెన్స్

Latest Updates