పాల ట్యాంకర్లో స్టూడెంట్లు

చెక్​పోస్టు వద్ద తనిఖీల్లో దొరికిన ముగ్గురు

మిర్యాలగూడ, వెలుగు: ఖాళీ పాల ట్యాంకర్లో ఏపీ సరిహద్దుదాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు స్టూడెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ముగ్గురు స్టూడెంట్లు హైదరాబాద్ లో ఉంటున్నారు. తమ స్వగ్రామం వెళ్లేందుకు కాలినడక, ఇతర మార్గాల్లో మిర్యాలగూడకు చేరుకున్నారు.

ఏపీకి వెళ్తున్న ఖాళీ పాల ట్యాంకర్లో ఎక్కారు. డ్రైవర్​కుముందుగానే డబ్బులు చెల్లించి ప్రయాణం ప్రారంభించారు. పొందుగుల వద్ద ఏపీ పోలీసుల తనిఖీల్లో ట్యాంకు లోపల కూర్చున్న ముగ్గురూ పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణఅనంతరం తిరిగి వెనక్కి పంపించారు. పాల ట్యాంకర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి వెహికల్ సీజ్ చేశారు.

Latest Updates