ఇప్పుడైతే కొంటం..ఎప్పుడైనా రానీ..!

హైదరాబాద్, వెలుగు : సిటిజన్స్, షాపింగ్ కి మధ్య ఓ స్పెషల్ బాండింగ్ ఉంటుంది. వీకెండ్ అయినా, అకేషన్ ఏదైనా, ఆఫర్స్ ఉన్నాయన్నా షాపింగ్ మాల్స్‌లో వాలిపోతుంటారు. వార్డ్ రోబ్ నిండినా ఇంకా కొనేద్దామనే వారే ఎక్కువ. లాక్ డౌన్ తో మాల్స్ క్లోజ్ అయినా, షాపింగ్ చేసేవారు ఆగడం లేదు. ఆన్లైన్లో క్యాస్టూమ్స్, వస్తువులను కొంటున్నారు. నచ్చిన ఐటమ్ ఎప్పుడొచ్చినా పర్లేదని చెప్తున్నారు.

అట్రాక్ట్ చేస్తున్న యాప్స్

ఫేమస్ క్లాత్ బ్రాండ్స్ అన్నింటికీ -వెబ్ సైట్స్, సోషల్యాప్స్ ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా డిజైన్ చేసేవారు తమ పేర్లతో ఆన్లైన్ పేజీలు మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ను లో డిఫరెంట్ డిజైన్స్, వెరైటీలతో వేలసంఖ్యలో అకౌంట్స్ కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ చేసేవారు యాప్స్‌తోపాటు ఇన్ స్టా పేజీలను ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఇండియన్, వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, స్టైలిష్ గార్మెంట్స్, జ్యువెల్లరీ, హోమ్ డేకర్స్, గ్యాడ్జెట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటివన్నీ అక్కడుంటున్నాయి. కొందరు ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఇస్తుంటే, మరికొందరు క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. నార్మల్ డేస్‌లోనే డెలివరీకి వారానికి పైగా టైమ్ పడుతుంది. ఇప్పుడు లాక్ డౌన్ ముగిశాకే షిప్పింగ్ చేస్తామని కస్టమర్లకు చెప్తున్నారు.

నచ్చితే విష్ లిస్ట్ కే

రెగ్యులర్‌గా షాపింగ్ చేసేవాళ్లు ఏదైనా ఐటమ్ నచ్చితే మళ్లీ ఆ ప్రొడక్ట్ దొరుకుతుందో, లేదోనని వెంటనే యాడ్ టు కార్ట్ చేస్తుంటారు. లాక్ డౌన్ తో షాపింగ్ కి దూరమైన చాలామంది మింత్రా, అజియో, ట్రెండ్స్, మ్యాక్స్, అమెజాన్ యాప్స్‌లోని డిఫరెంట్ బ్రాండ్స్ ని సెలక్ట్ చేసుకుని కొనేస్తున్నారు. ప్రొడక్ట్స్ సెలక్ట్ చేసుకుని
ఆన్ లైన్ పేమెంట్ చేసే వారికంటే విష్ లిస్ట్ లో పెట్టుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరి విష్ లిస్ట్ లో దాదాపు10కి పైగా ఐటమ్స్ ఉంటున్నాయి.

క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్

సమ్మర్ కోసం కాటన్, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కొనాలనుకున్నా. లాక్ డౌన్ కు ముందు ఇచ్చిన ఆన్లైన్ఆర్డర్ హోల్డ్ లో పడింది. యాప్ లో మాత్రం 24×7 సర్వీస్ అవేలబుల్లో ఉందని చూపిస్తోంది. డెలివరీ ఎప్పుడవుతుందో తెలియదు. సమ్మర్ వేర్ ఆర్డర్ చేసి, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టా.-       నందినివర్మిత, జూబ్లీహిల్స్

ఇన్ స్టాలో షాపింగ్ చేస్తున్న..

రీసెంట్ గా ఇన్ స్టా చూస్తుం టే ఓ కుర్తా బాగా నచ్చింది. వెంటనే ఆ అకౌంట్ మెయింటెన్ చేసేవాళ్లకి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టేశా. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేకపోయే సరికి ఆన్లైన్ పేమెంట్ చేశా. ఎప్పటికి వస్తుందో తెలియదు. లాక్ డౌన్ ఎక్స్ టెండ్ అయ్యి, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే పేమెంట్ రిటర్న్ చేస్తామని కూడా చెప్పారు. -శ్రావ్య, మాదాపూర్

Latest Updates