కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది

కుటుంబ సంబంధాలు మెరుగయ్యాయ్

కానీ యువతను బాధించింది

పని ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడ్డారు

సోషల్ లైఫ్‌ను కోల్పోయారు

మింట్-సీపీఆర్ సర్వేలో వెల్లడి

బిజినెస్‌‌‌‌‌‌‌‌డెస్క్, వెలుగు: కరోనా వైరస్ వచ్చి లైఫ్‌‌‌‌‌‌‌‌ స్టయిల్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా మార్చేసింది. కొందరు ఈ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో హ్యాపీగా ఫీల్ కాగా.. మరికొందరు అసలేం బాగలేదన్నారు. యూగవ్–మింట్–సీపీఆర్ మిలీనియల్ సర్వే ప్రకారం కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో కుటుంబ సంబంధాలు మరింత దగ్గరయ్యాయి. అంతేకాక ఇంట్లో వాళ్లపై కేరింగ్ కూడా పెరిగింది. అయితే చాలా మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అంత ఆసక్తి చూపించడం లేదని వెల్లడైంది. యూత్‌‌‌‌‌‌‌‌కు పని ఒత్తిడి, ఆందోళనలు పెరిగాయని చెప్పింది. హాలిడేస్‌‌‌‌‌‌‌‌లో స్నేహితులతో ఎంజాయ్ చేసే చాలా మంది తమ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ను కలువలేకపోయారని, దీంతో కొందరు ఒంటరిగా ఫీలైనట్టు తెలిపింది.

అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో యూగవ్–మింట్–సీపీఆర్ ఈ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 203 సిటీల్లో, పట్టణాల్లో సుమారు 10 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది. కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌కు ఏజ్, ఇన్‌‌‌‌‌‌‌‌కమ్, జెండర్ బట్టి ఇండియన్లు ఎలా స్పందించారు అనే విషయాలపై ఈ సంస్థ విశ్లేషణ జరిపింది.  గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూగవ్ ఇండియన్ సంస్థ మింట్, ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లు కలిసి జాయింట్‌‌‌‌‌‌‌‌గా ఈ సర్వే చేశాయి. ఈ సర్వేలో 24 నుంచి 39 ఏళ్లు ఉన్న వారు సగం మంది ఉండగా.. మిగిలిన వారు 18 నుంచి 23 ఏజ్ ఉన్న వారు, 39 పైన ఏజ్ ఉన్న వారు ఉన్నారు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ నుంచి తమ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడినట్టు మెజార్టీ రెస్పాం డెంట్లు(62 శాతం మంది) చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించినట్టు పేర్కొన్నారు. అయితే కరోనా సమయంలో చాలా మంది తమ సోషల్ లైఫ్‌‌‌‌‌‌‌‌ను కోల్పోయినట్టు బాధపడ్డారు.  ఫ్రెండ్స్, ఫ్యామిలీలతో సంతోషంగా గడపలేకపోయామని, ట్రావెల్‌‌‌‌‌‌‌‌, వెకేషన్లకు వెళ్లలేదని చెప్పారు. ఫైనాన్షియల్ సమస్యలు తలెత్తడంతో, పది మందిలో ఎనిమిది మంది ఒత్తిడికి గురైనట్టు తెలిపారు. ఒంటరి జీవితంతో 46 శాతం మందిరెస్పాండెంట్లు బాధపడ్డారు.పెద్ద వారితో పోలిస్తే.. యువతనే ఎక్కువగా ఒంటరిగా ఫీలయ్యారు.

ఆఫీసులకు వెళ్లడమే బాగుంది…

అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ అనుకూలంగా నిలువలేదు. 45 శాతం మంది మాత్రమే ఈ విధానం కొనసాగాలని కోరుకున్నారు. మిగిలిన వారు ఆఫీసులకు వెళ్లడమే మంచిదని భావించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌‌‌‌‌తో ఆఫీసు వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్ 81 శాతం పెరిగిందని తెలిపారు. ఇంటి పనులు సక్కబెడుతూ పని చేయడం చాలా మంది కష్టంగా భావించారు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ ముగిసిన తర్వాత కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తుండగా.. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మన్నాయి. కొన్ని సంస్థలు ఛాయిస్‌‌‌‌‌‌‌‌ను ఉద్యోగులకు వదిలేశాయి.

సోషల్ లైఫ్‌‌ లేదు…

లాక్‌‌డౌన్‌‌లో సోషల్ లైఫ్‌‌ పూర్తిగా కనిపించలేదు. రిమోట్ వర్క్ అనేది ఆర్గనైజేషన్ స్ట్రాటజీల్లో చాలా మార్పులు తెచ్చింది. సర్వేలో పాల్గొన్న 5,842 మంది రెస్పాండెంట్లు సగానికి పైగా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా.. మిగిలిన సగం మంది ఆఫీసులకు వస్తున్నారు. ఐటీ, ఎడ్యుకేషన్ స్పేస్‌‌లలో ఉన్న వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. హెల్త్‌‌కేర్, రిటైల్, ఆటోమొబైల్, యుటిలిటీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సి వస్తోంది. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే రిమోట్ వర్క్ కొనసాగించేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న 23శాతం మంది ఫుల్ టైమ్ ఆఫీసులకు వస్తున్నారు.  ఆఫీసులకు వస్తోన్న వారిలో మహిళలు 15 శాతం మంది మాత్రమే ఉన్నారు.

Latest Updates