లాక్ డౌన్ బేఖాతర్: 500 సార్లు ‘సారీ’ రాయించిన పోలీసులు

రిషికేశ్: లాక్ డౌన్ బ్రేక్ చేసిన 10 మంది ఫారినర్లతో 500 సార్లు ‘సారీ’ అని రాయాలని పోలీసులు పనిష్ మెంట్ విధించారు. ఉత్తరాఖండ్ రిషికేశ్ లోని తపోవనంలో విహరిస్తూ వివిధ దేశాలకు చెందిన 10 మంది పోలీసులకు చిక్కారు. ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. దీంతో పోలీసులు వారికి ఈ శిక్ష విధించారు. ‘లాక్ డౌన్ రూల్స్ పాటించలేదు నన్ను క్షమించండి’ అన్న వ్యాక్యాన్ని ప్రతి ఒక్కరితో 500 సార్లు రాయించారు. తపోవనంలో 500 మంది ఫారినర్స్ ఉన్నారని, తరుచూ లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారని తమకు సమాచారం వచ్చినట్లు ఎస్ ఐ వినోద్ కుమార్ శర్మ చెప్పారు. లాక్ డౌన్ ను తేలికగా తీసుకున్నవారిని హెచ్చరించేందుకే ఈ శిక్ష విధించినట్లు ఆయన చెప్పారు.

Latest Updates