కాచిగూడ రైలు ప్రమాదం: ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతి

కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలెట్ ఎల్.చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ కాచిగూడా రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కాచిగుడా స్టేషన్ లో కర్నూల్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వస్తున్న హంద్రీ ఎక్స్ ప్రెస్  – ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో రెండు రైళ్లలోని ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగిగాయి. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. రెండు రైళ్ల మధ్య నలిగి లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సుమారు 8 గంటల పాటు శ్రమించి అతన్ని అతి కష్టం మీద బయటకు తీశాయి. అనంతరం అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  ఒంటి నిండా గాయాలు , ప్రక్కటెముకలు విరగడం , కిడ్నీస్ ఇన్ఫెక్షన్ తో పాటు కాళ్లకు రక్తప్రసరణ లేకపోవడంతో వైద్యులు అతని వెంటిలేటర్ పై చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ శనివారం రాత్రి  తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. చంద్రశేఖర్ మృతదేహానికి ఆదివారం పోస్ట్ మార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.

Latest Updates