సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ ల పరిధిలో లోక్‌ అదాలత్‌

Lok Adalath will be held on April 27th within the range of 5 traffic PSs in Cyberabad

మాదాపూర్ , వెలుగు :ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించనివారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో సారి అవకాశం కల్పించారు. రూల్స్ పాటించకుండా పోలీసులకు చిక్కి కేసులు నమోదైన వాటిల్లో జైలు శిక్ష కాకుండా ఫైన్లు విధించనున్నా రు. ఏప్రిల్ 15వరకు సెల్ ఫోన్ డ్రైవింగ్ , డ్రంక్ ఆండ్ డ్రైవ్ , డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపి పట్టుబడ్డ వాహనదారులకు ఈ నెల 27న మియాపూర్ లోని కల్యాణ్ గార్డెన్ లో కోర్టు సమక్షంలో ఉదయం 7గంటలకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ లోక్ అదాలత్ లో కూకట్ పల్లి, గచ్చి బౌలి,మియాపూర్ , మాదాపూర్ , బాలానగర్ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి చార్జ్ షీట్ ఆధారంగా జరిమానాలు, శిక్షను విధిస్తారు. లోక్ అదాలత్ లో తమ కేసులను పరిష్కరించుకునే వాహనదారులు అధార్ కార్డు, లేక ఏదైనా గుర్తింపుకార్డు, తమ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు తమ వెంట తీసుకురావాలని పోలీసులు తెలిపారు.

పోలీస్ స్టేషన్ ల వారీగా పెండింగ్ కేసులు…

సైబరాబాద్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు చాలానే ఉన్నాయి.ఈ కేసులన్నీ లోక్ అదాలత్ లో పరిష్కరించేందుకు ఆయా స్టేషన్ ల పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఏప్రిల్ 15 వరకు నమోదైన కేసుల వివరాల ప్రకారం… మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 500 ,గచ్చి బౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో 210 ,మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో 300,బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో 200వరకు కేసులు నమోదైనట్లు ఆయా స్టేషన్ల సీఐలు తెలిపారు.ఇవే కాకుండా ఇంకా పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకునేలా వాహనదారులకు ఫోన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులుతెలిపారు.

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో నిండిపోతున్న వాహనాలు

వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి అనంతరం కోర్టులో డిపాజిట్ చేస్తారు. కోర్టు అదేశాల మేరకు వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్ లలో భద్రపరుస్తారు. డ్రంక్ఆండ్ డ్రైవ్ , డ్రైవింగ్ లైసెన్సు లేకుండా పట్టుబడ్డ వాహనదారులకు కోర్టు జైలుశిక్ష విధిస్తుంది. ఈ కేసుల్లో పట్టుబడ్డవారు కోర్టుకు వెళ్లకుండా, జరిమానాలు కట్టకుండా, కౌన్సిలింగ్ కు హాజరుకాకుండా తన వాహనాలను అలాగే పోలీస్ స్టేషన్ స్టేషన్ లలో వదిలి వెళ్తున్నారు. దీంతో మాదాపూర్ , గచ్చి బౌలి,మియాపూర్ , బాలానగర్, కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అవరణలు మొత్తం ఈ వాహనాలతో నిండిపోతున్నాయి.

Latest Updates