వారణాసిలో మోడీ భారీ విజయం

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ ఘన విజయం సాధించారు.  తన సమీప ప్రత్యర్ధి  షాలిని యాదవ్ పై దాదాపు నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఇక్కడి నుంచి వరుసగా రెండో సారి మోదీ పోటీ చేసి గెలుపొందారు. మోడీ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వారణాసిలో బీజేపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.

అదే విధంగా ఎన్డీయే స్పష్టమైన మెజారిటితో గెలుపు దిశగా దూసుకువెళ్తున్న క్రమంలో ఈ నెల 29న రెండోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా ఎన్నికల్లో భాజపా ప్రభంజనంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ కలిస్తే విజయీ భారత్‌ అని మోడీ ట్విటర్‌ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు.

Latest Updates