లోక్​సభ ఎన్నికలతో సేవలకు సెలవేనా?

lok sabha elections effect on private sector economy

నెల  రోజులుగా లోక్​సభ ఎన్నికలు జరుగుతున్నాయి.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్​ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు ఉంది. అందువల్ల ఏ పార్టీ గెలుస్తుందో  ఊహించలేని పరిస్థితి. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారా? లేక యూపీఏ–3 ప్రభుత్వం ఏర్పడుతుందా అనేది అంతు చిక్కట్లేదు. అన్ని వర్గాల ప్రజల్లోనూ ఇదే సస్పెన్స్ నెలకొంది.​ ఈ గందరగోళం సర్వీస్​ సెక్టార్​పై​ నెగెటివ్​ ఎఫెక్ట్​ చూపినట్లు ఇటీవల ఒక సర్వేలో తేలింది.

ప్రస్తుతం కొనసాగుతున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో అంత ఈజీగా అర్థం కావట్లేదు. బిజినెస్​మెన్​ సైతం దీన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. దీంతో వాళ్లు తమ వ్యాపారానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఎలక్షన్​ రిజల్ట్​ వచ్చే వరకు వాయిదా వేస్తున్నారు. కొత్తగా బిజినెస్​ పెట్టాలనుకునేవాళ్లు, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని పెంచాలనుకునేవాళ్లు కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం వస్తుందో చూద్దామని ఆగుతున్నారు. ఈ ప్రభావం సేవల రంగంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

దేశంలో సర్వీస్​ సెక్టార్​ అభివృద్ధి నెమ్మదించింది. గత ఏడు నెలలతో పోల్చితే ఏప్రిల్​లో మందగించింది. ‘ది నిక్కీస్​/ఐహెచ్​ఎస్​ మార్కిట్​ సర్వీసెస్​ పర్చేజింగ్ మేనేజర్స్​’ ఇండెక్స్​ 52 పాయింట్ల నుంచి 51కి తగ్గింది. ఈ సూచిక ఇంత తక్కువ నమోదవటం సెప్టెంబర్​ నుంచి ఇదే తొలిసారి. గ్రోత్​ని తెలిపే ఈ ఇండెక్స్​ వరుసగా 11వ నెల కూడా 50 మార్క్​ పైనే ఉండటం విశేషం. ఎన్నికల ఫలితాలు వచ్చి, కొత్త సర్కారు ఏర్పడేటప్పటికి మే నెల పూర్తవుతుంది. అప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మార్కు 49కి పడిపోతుందేమోననే ఆందోళన నెలకొంది.

గడచిన పది నెలల్లో ఫారిన్ డిమాండ్​ వేగంగా వృద్ధి చెందినా కొత్త బిజినెస్​లను ట్రాక్​ చేసే ఒక సబ్​ ఇండెక్స్​ మాత్రం ఏడు నెలల్లో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్​లో పడిపోయింది. వివిధ సంస్థలు తమ ప్రొడక్టుల రేట్లను ఇటీవల పెంచటంతో మార్చిలో 52.3 పాయింట్ల వద్ద ఉన్న ఈ ఇండెక్స్ ఏప్రిల్​లో 51.2 పాయింట్లకు తగ్గింది. ఇన్​ఫ్లేషన్ ప్రస్తుతం మీడియం టర్మ్​ టార్గెట్ వద్దే ఉండటం,  ఎన్నికలకు ముందు ఆర్బీఐ ప్రధాన వడ్డీ రేట్లను రెండు సార్లు తగ్గించటం వల్ల ద్రవ్యోల్బణం గతంతో పోల్చితే ఇప్పుడు తక్కువగానే ఉంది.          ​

ఎకానమీ గ్రోత్​ పడిపోయిన మ్యానిఫ్యాక్చరింగ్, సర్వీస్​ సెక్టార్లలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా లేకపోవటం​ పర్చేజ్​ రేట్ మరింత తగ్గటానికి దారితీస్తాయి. మార్చితో పోల్చితే ఏప్రిల్​లో ఇండస్ట్రియల్​ ఔట్​పుట్​లో పెరుగుదల కూడా నిదానంగానే సాగింది. ఫలితంగా కాంపోజిట్​ పీఎంఐ గత ఏడు నెలల్లో లేనంత తక్కువగా 51.7 వద్ద నిలిచింది. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియని పరిస్థితుల్లోనూ వివిధ కంపెనీలు పాజిటివ్​గానే ఆలోచిస్తూ గత నెలలో రిక్రూట్​మెంట్లను పెంచటం సంతోషించాల్సిన విషయం.                                                                                                                        – ‘ది వైర్​’ సౌజన్యంతో

ఎన్నికలే  కారణం

ఇండియాలో ప్రైవేట్​ సెక్టార్​ ఎకానమీ గ్రోత్​ స్లోగానే ఉండొచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ లోక్​సభ ఎన్నికల వల్ల తలెత్తిన ఆటంకాలే ఆర్థిక రంగంలో అభివృద్ధి తగ్గటానికి ప్రధాన కారణం. వ్యాపార సంస్థలు సహజంగానే కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందా, ఎలాంటి విధానాలను అమలు చేస్తుందా అని ఎదురుచూస్తాయి.​ బిజినెస్​ డెవలప్​మెంట్‌కి అనుకూల నిర్ణయాలు తీసుకునే గవర్నమెంట్​ రావాలని కోరుకుంటాయి. అందులో తప్పేమీ లేదు.

– పాల్లియానా డి లిమా, ప్రిన్సిపల్​ ఎకనమిస్ట్​, ఐహెచ్​ఎస్​ మార్కిట్

Latest Updates