లోక్ సభ ఎన్నికలు: బీహార్ లో పోటా పోటీ

బీహార్‌‌లో బీజేపీ అగ్నిపరీక్ష ఎదుర్కోబోతోంది. మొత్తం 40 లోక్‌‌సభ సీట్లలో 19 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మిగిలిన మూడు విడతల్లో 21 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ చివరి మూడు విడతల్లో ఐదుగురు కేంద్రమంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీకి బలమున్న రాష్ట్రాల్ లో బీహార్‌‌ కూడా ఒకటికావడంతో ఆపార్టీ గెలుపుకోశం తీవ్రంగా శ్ర-మిస్తోంది.చివరి మూడు విడతల్లో ని మొత్తం21 సీట్లలో బీజేపీ గత లోక్‌‌సభ ఎన్నికల్లో 15స్థానా లను గెలుచుకుంది. ఎన్డీయే భాగస్వామ్యపార్టీలైన ఆర్‌‌ఎల్‌‌ఎస్పీ మూడు సీట్లను ఎల్జీపీరెండు సీట్లను గెలుచుకుంది. నలందా సీటులోమాత్రమే ఎన్డీయే ఓడిపోయింది. ఈసీటులో జనతాదళ్‌ (యునైటెడ్‌‌) గెలిచింది. ఇది ముఖ్యమంత్రి నితీశ్‌‌కుమార్‌‌   సొంత జిల్లా కావడంవిశేషం. జేడీయూ , బీజేపీ కూటమిగా పోటీచే-స్తున్న సంగతి తెలిసిందే. చివరివిడతలో జరగ-బోయే 21 సీట్లలో బీజేపీ 12 స్థానాల్ లో మాత్రమేపోటీచేస్తోంది. మిత్రపక్షమైన జీడీ-యూ 7 సీట్లలో, ఎల్జేపీ రెండింటిలో  పోటీచేస్తున్నాయి. మిత్రపక్షాలకు తమ ఓట్లను ట్రాన్స్‌ ఫర్‌‌ చేయడం ద్వారావీలైన ఎక్కువ సీట్లలో విజయం సాధించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓట్లు చీలిపోకుండా కిందిస్థాయి లో కార్యకర్తలంతా  కలిసిమెలిసిగెలుపు కోసం పనిచేస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రతినియోజకవర్గం లోనూ సీనియర్‌‌ నేతలు మీటింగ్‌‌లు పెట్టి నితీశ్‌‌ సర్కార్‌‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రం లోని మొత్తం 40 సీట్లలో బీజేపీ, జేడీయూచెరి 17 సీట్లలో, ఎల్జేపీ 6 స్థానాల్ లో పోటీ చేస్తోంది.

చివరి విడతల్లో పోటీలో ఉన్న కేంద్రమంత్రులు: రవిశంకర్‌‌ ప్రసాద్‌ ( పాట్నా సాహిబ్‌ ), రామ్‌కృపాల్‌‌ యాదవ్‌‌( పాటలీపుత్ర), ఆర్.కె.సింగ్‌‌ (అరా), అశ్విని ఛౌబే (బాక్సార్‌‌), రాధామోహన్‌‌ సింగ్‌‌ (పూర్వి చంపారన్‌‌) పాట్నా సాహిబ్‌ లోపోటీ రసవత్తరంగా ఉంది. బాలివుడ్‌‌ యాక్టర్‌‌గా పేరు తెచ్చుకుని రాజకీయాల్లో కి వచ్చి న శత్రుఘ్నసి న్హా కేంద్రమంత్రి రవిశంకర్‌‌ ప్రసాద్‌ తోతలపడుతున్నారు. ఇద్దరూ కాయస్థ కులం ఓట్లపైకన్నేశారు. పాటలీపుత్రలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కేంద్రమంత్రి రామ్‌ కృపాల్‌‌ యాదవ్‌‌,ఆర్జేడీ అభ్యర్థి మీసా భారతి మధ్య గట్టిపోటీ ఉంది. వీళ్లద్దరూ యాదవ కులాని కి చెందినవారు కావడంతో యాదవ ఓట్లు చీలిపోయే అవకాశముంటుందని భావిస్తున్నారు. శరన్‌‌ లోక్‌‌సభసీటు ఆర్జేడీకి కంచుకోటగా చెబుతారు. అయితేఇక్కడ బీజేపీ తరపున కేంద్రమాజీ మంత్రి రాజీవ్‌‌ ప్రతాప్‌ రూడీ, ఆర్జేడీ తరపున మాజీ రాష్ట్ర మంత్రి చంద్రికా రాయ్‌‌ పోటీచేస్తున్నారు. చంద్రికారాయ్‌‌ ఆర్జేడీ యువనేత తేజ్‌‌ప్రతాప్‌ యాదవ్‌‌ మామ. గెలుపును ప్రస్టేజిగా తీసుకున్న రాయ్‌‌..ప్రతాప్‌ రూడీకి వ్యతిరేకంగా ఓట్లేయా లంటూ పిలుపునిస్తున్నారు.

కూటమి పరిస్థితి ఎలా ఉందంటే…

చివరి విడతల్లో జరిగే 21 సీట్లలో మహాకూటమి అరా స్థానంలో మాత్రం పోటీచేయడంలేదు.ఇక్కడ కేంద్రమంత్రి , బీజేపీ కేండిడేట్‌‌ ఆర్‌‌.కె.సింగ్‌‌పై పోటీచేస్తున్న లెఫ్ట్‌‌ అభ్యర్థి రాజుయాదవ్‌‌కు కూటమి సపోర్ట్‌‌ చేస్తోంది. మిగిలినసీట్లలో ఆర్జేడీ 11 , కాంగ్రెస్‌‌, ఆర్‌‌ఎల్ఎస్పీ చెరిమూడు సీట్లు, వీఐపీ రెండు, హెచ్‌‌ఏఎంఎస్‌‌ ఒకస్థానంలో పోటీ చేస్తున్నాయి.

Latest Updates