ఎంపీల జీతంలో 30 శాతం కోత బిల్లుకు లోక్ సభ ఆమోదం

కరోనా కారణంగా ఎంపీ వేతనాల్లో కోతకు లోక్ సభ ఆమోదం తెలింది. వైరస్ పై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును ఇవాళ( మంగళవారం, సెప్టెంబర్-15) లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరోవైపు… ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Latest Updates