లోకేష్ బందరు పోర్ట్ కామెంట్ కు కేటీఆర్ ట్వీట్

తెలంగాణ సీఎం కేసీఆర్.. మచిలీపట్నం పోర్టును ఎత్తుకువెళ్లాలి అనుకుంటున్నారంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో ఒకరేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. లోకేష్ కామెంట్స్ ని ఓ నెటిజన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేశాడు.  ‘‘ ఈ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ కి ఓటు వేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే.. తెలంగాణకు మచిలీపట్నం పోర్టు తేవడంలో కేసీఆర్, కేటీఆర్ ఫెయిల్ అయ్యారు’’ అంటూ ఓ నెటిజన్ .. లోకేష్ కి కౌంటర్ గా చేసిన ట్వీట్ కి కేటీఆర్ స్పందించారు. నవ్వుతున్న ఎమోజీలను తన ట్వీట్ కి సమాధానంగా పెట్టారు.

 

Latest Updates