సారొస్తేనే కారు స్పీడ్: కేసీఆర్ కోసం కొత్త అభ్యర్థుల ఎదురుచూపులు

 

లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్ల లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పనిచేస్తోం ది. అన్ని సీట్లూ గెలిస్తే ఢిల్లీలో రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధించుకోవచ్చునని ప్రచారం చేస్తోం ది. కొందరు నేతలైతే 16 సీట్లు గెలిస్తే కేసీఆరే ప్రధానమంత్రి కావచ్చని కూడా చెబుతున్నారు. అయితే 16 మంది అభ్యర్థుల్లో కొత్త ముఖాలు బరిలో ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటు న్నారు. ప్రచారానికి ఇంకా పదిరోజులే ఉండడంతో అభ్యర్థులను పరిచయం చేయడంలో వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేసీఆర్‌ వచ్చి విస్తృతంగా ప్రచారం చేస్తే గట్టెక్కుతామని వారు భావిస్తున్నారు. అవసరమైతే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆయన సభలు ఏర్పాటు చేయాలని వారు అడుగుతున్నారు. – హైదరాబాద్‌, వెలుగు

 సారే రావాలి

టీఆర్ఎస్ లో ఎంపీ అభ్యర్థులు  ప్రధానం కాదనీ, సీఎం కేసీఆరే అభ్యర్థి అని పార్టీ నేతలు మొదటి నుంచీ ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులను కాకుండా సారు, కారును చూసే ఓటేయాలని చెబుతున్నారు. ఆ ధీమాతోనే కొత్త అభ్యర్థులను కూడా గెలిపించుకోవాలని భావిస్తోంది. అయితే కొత్తవారిని గెలిపించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలపైనే ఉంచడంతోవారిలోనూ కొం త ఆందోళన పెరుగుతోం ది.కొత్తవారు కావడం వల్ల ఏదైనా తేడా వస్తేఅది తమకు ఇబ్బందికరంగా మారుతుం దన్న బాధ వెంటాడుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కేసీఆరే స్వయంగా రావాలని వారు భావిస్తున్నారు. ఆయన వస్తేనే కొత్త అభ్యర్థుల విషయంలో పరిస్థితి సానుకూలంగా మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేతల కుటుంబాలకు చెందిన కొత్త అభ్యర్థుల ప్రచార భారాన్ని ఆ నేతలే తలకెత్తుకొని నడిపిస్తున్నారు. అలాంటివారు లేని కొత్త అభ్యర్థుల ప్రచారాన్ని స్థానిక మంత్రులు,ఎమ్మెల్యేలు మోస్తున్నారు. సికింద్రాబాద్‌ బరిలోఉన్న తలసాని సాయికిరణ్‌  ప్రచారాన్ని ఆయన తండ్రి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ముందుండి చేస్తున్నారు. ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యే కావడంతో ఆ సెగ్మెంట్లో మంచి పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సాయికిరణ్  పాల్గొ నడంతో ఈ సెగ్మెం ట్ వరకు ఆయనకు గుర్తింపు ఉంది. సికింద్రాబాద్ సెగ్మెం ట్ లో ఎమ్మెల్యే పద్మారావు డిప్యూటీ స్పీకర్ కావడంతో ఆయన నేరుగా ప్రచారంలో పాల్గొ నే అవకాశం లేదు . దీంతో పార్లమెంటు సీటు పరిధిలోకి వచ్చే ఇతర  సెగ్మెం ట్లలో సాయికిరణ్ తనను తాను పరిచయడం చేసుకునే పనిలో ఉన్నారు. తలసాని వెంట ఉంటే తప్ప ప్రచారం ఎవరిదో తెలియడం లేదని ఖైరతాబాద్‌ సెగ్మెంట్ కు  చెందిన ఒక నేత వ్యాఖ్యానిం చారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న కిషన్‌ రెడ్డి, కాం గ్రెస్‌ అభ్యర్థి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ సీనియర్లు.  కిషన్‌ మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఫ్లోర్‌ లీడర్ గా, బీజేపీ మాజీ అధ్యక్షుడిగా అందరికీ తెలుసు. అంజన్‌ ఈస్థానం నుంచి రెండుసార్లు గెలిచారు. గత ఎన్ని కల్లో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గుర్తిం పుతో పాటు ప్రస్తుతం సిటీ కాం గ్రెస్‌ అధ్యక్షుడిగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు.

నల్గొండ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డి రియల్టర్‌. ఆయన ప్రచారాన్ని మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు తలకెత్తుకున్నారు. స్థానికులకు తెలిసిన ముఖం కాకపోవడంతో ఆయనను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి వస్తోంది. ప్రత్యర్థి స్వయానా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.  ఆయన భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి జిల్లాలో అందరికీ తెలుసు. వారు ప్రచారంలో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. వారి ప్రచారాన్ని ఎదుర్కోవాలంటే సీఎం రెండు,మూడు సభలన్నా నిర్వహించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. శుక్రవారం మిర్యాలగూడ సభలో వేంరెడ్డిని కేసీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేయడం కాస్త ఉపయోగపడిం ది. ఆయన కొత్తవాడు కాదనీ, పార్టీకి 15 ఏళ్లుగాఅనుబంధం ఉందని కేసీఆర్ చెప్పారు.

మహబూబాబాద్‌ బరిలో ఉన్న మాలోతు కవిత డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ కుమార్తె. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ఆమె తెలుసు. దీంతో లోక్ సభ స్థానం పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలపై ఆమె ఆధారపడుతున్నారు. ఆమెకు పోటీగా కాం గ్రెస్‌ నుంచి మాజీ మంత్రి బలరామ్ నాయక్‌ బరిలో ఉన్నారు.

పెద్దపల్లి బరిలో ఉన్న బోర్లకుంట వెంకటేశ్‌అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్‌ అభ్యర్థిగా చెన్నూరు నుంచి ఓడిపోయారు. టీఆర్ఎస్ ఎంపీ టికెట్లుప్రకటించిన రోజే గులాబీ కండువా కప్పుకున్నారు. చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ కే కొత్తయిన ఆయన పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని ఇతర సెగ్మెం ట్లలో అటు ఓటర్లకు, ఇటు పార్టీ క్యాడర్ కు ఏ మాత్రం పరిచయం లేదు . ఎక్సైజ్‌ శాఖలో రిటైరైన వెంకటేశ్‌కు స్థానికంగా సొంత క్యాడర్‌ కూడా లేదు . ఆయన గెలుపు భారాన్ని మంత్రికొప్పుల, ఎమ్మెల్యేలు తలకెత్తుకున్నారు.

మహబూబ్ నగర్‌ స్థానంలో టీఆర్ఎస్‌ అభ్యర్థి పారిశ్రామికవేత్త  మన్నె శ్రీనివాస్‌ రెడ్డి గెలుపు బాధ్యతను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ భుజాన వేసుకున్నారు. మన్నె పార్టీకి కొత్త. కేడర్ లోనూ చాలామందికి తెలీదు. ఆయనకు స్థానిక నేతలతో అంతగా పరిచయం లేదు . బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు గద్వాల జేజమ్మగా రాష్ట్రమంతా పేరుంది. గద్వాల జిల్లాను సాధించి న గుర్తింపుం-ది. చాలా సెగ్మెంట్లలో ఆమెకు బంధువులున్నారు. కాం గ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే. యూత్‌ కాం గ్రెస్‌ అధ్యక్షుడిగా జిల్లాతో పాటు రాష్ట్రమంతా తెలిసిన నేత.

మల్కాజ్ గిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి మంత్రి మల్లారెడ్డికి అల్లుడు. గతంలో రాజకీయాల్లో లేని ఆయన కేడర్ కు, జనానికి కూడా పరిచయం లేదు . దీంతో ఆయన్ను నేతలు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి వస్తోంది. ఆయన్ను గెలి-పించుకునే బాధ్యతను మల్లారెడ్డి మోస్తున్నారు. స్థానిక  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కాం గ్రెస్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపున్న రేవంత్ రెడ్డి బరిలోఉన్నారు. ఆయన సొంతంగానే ప్రచారం చేసు-కుంటున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు కూడా నియోజకవర్గం లో తెలిసిన నేతే. ఆయన అసెంబ్లీ ఎన్ని కల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ కు మాత్రమే కొత్త. టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేతగా, మాజీ ఎంపీగా ఆయన అందరికీ పరిచయమే. ఇక్కడ ఆయన ప్రధాన ప్రత్యర్థిగా కాం గ్రెస్‌ నుంచి రేణుకాచౌదరి బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోఖమ్మం పరిధిలో గెలిచిన కాం గ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపుగా టీఆర్‌ఎస్ లో చేరిపోయారు. ఈ ఫిరాయిం పులపై స్థానికంగా జనంలో కొంత ఆగ్రహం ఉందని చెబుతున్నారు. దీన్ని ఎదుర్కోవడమే స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలకు సవాలుగామారిం ది. ఖమ్మం గెలుపును సీఎం కూడా ప్రతిష్ఠా త్మకంగా తీసుకుంటున్నారు.

నాగర్‌ కర్నూల్‌ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పోతుగంటి రాములు టీడీపీ హయాం లోమంత్రిగా చేశారు. 2014లో అచ్చం పేట నుంచిటీడీపీ తరపున పోటీ చేసి ఓడారు. తర్వాత టీఆర్‌ఎస్ లో చేరినా కేడర్ లో అంతగా పట్టులేదు .పాత తరం నాయకులకే ఆయన తెలుసు. ఇదే స్థానంలో కాం గ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ మల్లురవి, బీజేపీ నుంచి దివంగత బంగారు లక్ష్మణ్‌ బిడ్డ బంగారు శ్రుతి బరిలో ఉన్నారు.

చేవెళ్ల నుంచి బరిలోకి దిగిన గడ్డం రంజి-త్ కుమార్‌ స్థానికంగా పౌల్ట్రీ వ్యాపారంలోఎదిగారు. అయితే జనంలో పరిచయం లేకపోవడమే ఆయన ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. పార్టీ కేడర్ కూ ఆయన కొత్తే. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మీద ఆధారపడి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. రంజిత్ కు ప్రత్యర్థిగా ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాం గ్రెస్‌ తరపున పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఆయన నియోజకవర్గం లో అందరికీ తెలుసు.

Latest Updates