అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి

Loksabha Elections 2019: Rahul lose Amethi

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 24,404 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పేర్కొన్నారు. అమేథిలో తన పరాజయాన్ని అంగీకరించారు రాహుల్. ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆ నియోజకవర్గంలో విజయం సాధించిన స్మృతి ఇరానీని ఆయన అభినందించారు.

మరోవైపు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. ఆ స్థానం నుంచి 8 లక్షల ఓట్ల మెజారిటితో భారీ విజయం సాధించారు.

Latest Updates