గుజరాతీ ముస్లిం ఎటు?

బీజేపీ అంటే ఒక మతానికి సంబంధించిన పార్టీయే అని చాలా మంది అనుకుంటారు. పదీ పదిహేనేళ్ల కిందట గుజరాత్ లోని మెజారిటీ ముస్లింలు కూడా ఇలాగే డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ల ఆలోచనలో మార్పు వచ్చి నట్లు కనిపిస్తోంది. పదేళ్లలో రాష్ట్రంలో అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఆ పార్టీ ప్రభుత్వం కృషి చేసిందనే అభిప్రాయం నెలకొనటమే దీనికి కారణం. గోద్రా గొడవల (2002) తర్వాత అల్లర్లు లేని పాలన అందిస్తుం డటాన్నీ పలువురు గుర్తుచేస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఆర్థికంగా సమ న్యాయం చేస్తోందని చెబుతున్నవారిలో ముస్లింలు కూడా ఉన్నారు. రాష్ట్ర సర్కారు పథకాలు బాగుండటంతో లబ్ధిదారులు తమంతటతామే బీజేపీలో సభ్యులుగా చేరుతున్నారని, కంపెయినర్లుగా మారుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నా యి. ఇందులో మెజారిటీ ప్రజలు వ్యక్తిగతంగా ప్రభుత్వ సాయం పొందారని చెబుతున్నాయి.

బీజేపీలో ప్రస్తుతం ఉన్న లీడర్లను, భవిష్యత్ తరం నాయకత్వాన్ని చూసి మోటివేట్ అయి సభ్యత్వం తీసుకుంటున్నా రని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. భవిష్యత్ దృష్ట్యా..రాష్ట్రంలో ఎక్కువ కాలం పవర్ లో ఉండే అవకాశం గల పార్టీలో చేరితే ఈరోజు కాకపోయినా రేపైనా తమకు న్యాయం జరుగుతుందనే భావన బీజేపీలో ఇటీవల చేరుతున్న సభ్యుల్లో, నేతల్లో నెలకొంది. వ్యక్తిగతంగానే కాక పాలిటిక్స్ లో వృత్తిగతంగా కూడా శాటిసిఫ్యాక్షన్ ఉండాలంటే ఆ పార్టీయే సరైన వేదికని వాళ్లు నమ్ముతున్నట్టు కనిపి స్తున్నా రు. అహ్మదాబాద్ లోని బెహ్రంపురా ఏరియాకి చెందిన ఓ నాయకుడు గతంలో కమ్యూని స్ట్​ పార్టీలో ఉండేవారు. పీపుల్స్ వర్కర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు పూర్తి స్థా యిలో సేవ చేయాలంటే వ్యక్తిగతంగా పేరుంటే చాలదు కదా. రాజకీయ అండదండలు కూడా కావాలి. రాష్ట్రం లో కాం గ్రెస్ కి, కమ్యూని స్టులకు భవిష్యత్ లేదని ఆయనకు అర్థమైంది. హస్తం పార్టీ తర్వాత బెస్ట్​ ఆప్షన్ గా బీజేపీయే కన్పించింది.

సెక్యూ రిటీ అంటే ఫిజికల్ సెక్యూరిటీ మాత్రమే కాదు. దేశ భద్రత కూడా. పొలిటికల్ పవర్ , సోషల్ సెక్యూరిటీ, ఫ్యూచర్ .. ఇలా ఏవిధంగా చూసినా బీజేపీయే కరెక్ట్​ అనిపించింది. దీంతో అతను రెండో ఆలోచన లేకుండా కమలనాథులతో కలిసిపోయారు. రెండేళ్ల కిందటే వలసలు మొదలు గుజరాత్ లో బీజేపీలోకి ఇతర పార్టీల కార్యకర్తల, నేతల వలసలు రెండేళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముం దు వేల సంఖ్యలో కాం గ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. అందులో ఆ పార్టీ మైనారిటీ సెల్ వైఎస్ ప్రెసిడెంట్ మహ్మూదాబెన్ షేఖ్ కూడా ఒకరు. గుజరాత్ లో హస్తం పార్టీపై ఆశలు లేకపోవటం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అప్పట్లో చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా మురికివాడల జనాలకు నగరంలో ఓ చోట ఆశ్రయం కల్పించారు.

దీంతో చాలా మంది బీదలకు తలదాచుకోవటానికి నీడ దొరికింది. బీజేపీ అమలు చేస్తున్న ఇలాంటి విధానాల వల్ల, ప్రభుత్వ పథకాల వల్ల ప్రత్యక్ష ప్రయోజనం పొందకపోయినా పరోక్షంగా లాభపడ్డామనే ఆనందం మైనారిటీల్లో వ్యక్తమవుతోందని, ఇది లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో కనిపించబోతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఓటుకు మించిన అభిమానం పంచమహల్ జిల్లాలో గోద్రా ఒక మునిసిపాలిటీ. మత కలహాల తర్వాత అక్కడి బాపూనగర్ నుంచి తూర్పు అహ్మదాబాద్ లోని బాం బే హోటల్ స్లమ్ ఏరియాకి సూరయ అనే ఓ మహిళ వలస వచ్చింది. 16 ఏళ్లకు పైగా ఇక్కడి మునిసిపల్ డంపింగ్ యార్డ్​ వద్ద పునరావాస శిబిరంలో ఉంటున్న ఆమె రాష్ట్ర​ ప్రభుత్వ పథకాలు నచ్చి 2010లో బీజేపీలో చేరింది. అభిమానం ఉన్నప్పుడు ఓటేస్తే సరిపోతుంది కదా పార్టీలో చేరటం ఎందుకంటే బీజేపీపై తనకు ఓటుకు మించి న అభిమానం ఉందని చెప్పింది. పార్టీ తరఫున స్థానికులకు సాయపడుతున్నా నని అంటోంది. పేదోళ్లకు , అక్షరమ్ముక్కరా నోళ్లకు ప్రభుత్వాఫీసుల్లో పనులు చేసి పెడుతున్నానని, ఫలితంగా కాస్తో కూస్తో డబ్బు, నలుగురిలో గుర్తింపు వస్తోందని అంటోంది.

Latest Updates