7న నియోజకవర్గాలకు ఈవీఎంలు : రజత్ కుమార్

లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు రాష్ట్ర ఎన్నికల ఛీఫ్ రజత్ కుమార్. ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నగదు, మద్యం, ఇతర వస్తువులు కలిపి రూ.29 కోట్ల సొత్తును సీజ్ చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 300కు పైగా కేసులు నమోదు చేశామని.. నిజామాబాద్‌ లో 1780 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పెయిడ్ న్యూస్‌ పై 600 ఫిర్యాదులు అందాయని తెలిపారు రజత్ కుమార్. 560 మంది అధికారులు ఈవీఎం పరిశీలనలో ఉన్నారన్నారు. 7వ తేదీ రాత్రి వరకు అన్ని నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరుతాయని తెలిపిన రజత్ కుమార్..ఎన్నికల అధికారులకు ఇప్పటికే ట్రైయినింగ్ ఇచ్చామన్నారు. నిజామాబాద్ ఎన్నికపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.

Latest Updates