ఇంకొద్ది గంటల్లోనే రిజల్ట్స్ : నేతల్లో టెన్షన్

loksabha-results-tobe-announced-shortly-230240-2

ఇంకొద్ది గంటల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్. నేతల్లో ఆందోళన.. అధికారుల్లో హడావుడి. ఇక జనమైతే ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. హంగ్ వస్తుందని కొందరు, NDAకే మెజార్టీ అని ఇంకొదరు. ఒకవేళ హంగ్ వస్తే.. ఎవరు కింగ్ మేకర్ అనే దానిపైనా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు జనం. NDA, UPAకు దూరం మెయింటైన్ చేస్తున్న TRS, TDP, YCP, BJD, SP, BSP, TMCలాంటి పార్టీల ఏ స్టెప్ తీసుకుంటాయన్నదానిపైనా చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఐతే ఎగ్జిట్ పోల్స్ మాత్రం NDAదే మళ్లీ అధికారముంటన్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ పైనా రెండ్రోజులుగా పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మేది లేదని విపక్షపార్టీ ల నాయకులు అంటుంటే.. రాబోయే ఫలితాలనే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని అధికారపార్టీ నాయకులు చెప్పుకొచ్చారు.

ఇక NDA పార్టీలకు నిన్ననే ధావత్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. దీనికి NDA పార్టీలన్ని హాజరయ్యాయి. నితీష్ కుమార్, ఉద్దవ్ ఠాక్రే లాంటి సీనియర్లంతా డిన్నర్ కు వచ్చారు. దీనికంటే ముందు కేంద్రమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. మళ్లీ గెలుపు మనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్షాలు మాత్రం EVM, VVPAT లపై పోరాటం చేశాయి. నిన్న 22పార్టీల నేతలు CECని కలిశారు. ముందుగా VVPATలు లెక్కించి తర్వాతే ఈవీఎంలు లెక్కించాలంటూ ప్రపోజల్ పెట్టాయి. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. కౌంటింగ్ పద్దతులను ఇప్పటికిప్పుడు మార్చలేమని స్పష్టం చేసింది. ఎప్పటిలాగే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని తేల్చి చెప్పింది. సుప్రీం చెప్పినట్లుగానే చివరలో ప్రతి నియోజకవర్గంలో ఐదు వివి ప్యాట్స్ లెక్కిస్తామని చెప్పింది.

ఏడు దశల్లో ఎన్నికలు ఇలా జరిగాయి

ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలు కేంద్ర బలగాల పహారాలో స్ట్రాంగ్ రూముల్లో  ఉన్నాయి.

తొలి విడత ఏప్రిల్ 11న జరిగింది. ఈ ఫేజ్ లో ఏపీ, తెలంగాణలో ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.

అటు ఏప్రిల్ 18న రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.

థర్డ్ ఫేజ్ ఏప్రిల్ 23న జరిగింది. 14 రాష్ట్రాల్లోని 115 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు.

ఏప్రిల్ 29న జరిగిన నాలుగో విడతలో 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు.

ఐదో విడత మే 6న నిర్వహించారు. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 సీట్లకు పోలింగ్ జరిగింది.

మే 12న ఆరో విడత ఎన్నికలు పూర్తయ్యాయి. 7 రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

చివరగా ఏడో విడత మే 19న జరిగింది. ఇందులో 8 రాష్ట్రాల్లోని 59 నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించారు.

Latest Updates