17న హార్వర్డ్ వర్సిటీలో లోక్ సత్తా జేపీ ప్రసంగం

అమెరికా మసాచుసెట్స్ కేంబ్రిడ్జ్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి 17న ‘ఇండియా కాన్ఫరెన్స్ 2019’లో జేపీ మాట్లాడతారు. భారత రాజకీయాలపై ఇండియా ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడేందుకు, చర్చించేందుకు, సమన్వయం చేసుకునేందుకు ఏటా నిర్వహించే ప్రపంచస్థాయి సమావేశాల్లో ఇదీ ఒకటి. ఇండియా కాన్ఫరెన్స్ 16 వార్షికోత్సవాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఇండియాలో పరిస్థితులపై దాదాపు వెయ్యి మంది నాయకులు, మేధావులు, విద్యార్థులు, యువ వృత్తి నిపుణులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు … హార్వర్డ్ కెనడీ స్కూల్ లో ఫిబ్రవరి 16న ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ చర్చలోనూ జేపీ పాల్గొంటారు. ఆ తర్వాత 17న ఇండియా కాన్ఫరెన్స్ లో.. “సంధి దశలో ఇండియా – దిశను మార్చే ఎజెండా” జేపీ మాట్లాడతారు.

Latest Updates