లోక్ సభ ఐదో విడత పోలింగ్ నేడే

  • లోక్ సభకు ఐదో విడత నేడే
  • ఏడు రాష్ట్రాల్లోని 51 స్థానాల్లో పోలింగ్
  •  గతా ఫేజ్ లకు భిన్నంగాఎక్కువ మంది మహిళల పోటీ
  •  ఓటింగ్ పెరగాలంటూనేతల మెసేజ్ లు

సార్వత్రిక ఎన్నికల ఐదో ఫేజ్ కు సర్వం సిద్ధమైంది.ఏడు రాష్ట్రాల్లో ని 51 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసింది. మిగతా ఫేజ్ లకు భిన్నంగా , ఐదో దశలో ఎక్కువ మంది మహిళలు పోటీ పడుతుండటం గమనార్హం. నేడు పోలింగ్ జరుగనున్న 51 సెగ్మెంట్లలో మొత్తం 674 మంది క్యాండేట్లుండగా, వారిలో మహిళల సంఖ్య 79గా ఉంది.ఫిఫ్త్​ ఫేజ్ లో పోటీ పడుతున్న ప్రముఖుల్లో సోనియాగాంధీ, పూనమ్ సిన్హా, స్మృతి ఇరానీ, మహబూబాముఫ్తీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, కృష్ణ పునియా, జ్యోతిమిర్ధా (నాగౌర్ ) తదితరులున్నారు. ఇక పురుషుల విషయానికొస్తే, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, రాజ్ నాథ్  సింగ్ (లక్నో ), రాజ్యవర్థన్‌‌ రాథోడ్‌ , అర్జున్‌‌ రామ్‌‌ మేఘ్వాల్‌‌ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 ఎన్నికలు జరిగే స్థానాలివే..

ఐదో ఫేజ్ లో భాగంగా అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లోని14 లోక్ సభ స్థానాల్లో , రాజస్థాన్ (12), బెంగా ల్ (7),మధ్యప్రదేశ్ (7), బీహార్ (5), జార్ఖండ్​(4), జమ్మూకా-శ్మీర్ లోని 2 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.

అన్నను గెలిపించండి : ప్రియాంక

సోమవారం జరిగే పోలింగ్‌‌లో అమేథీ ఓటర్లందరూ పాల్గొని , రాహుల్‌‌గాంధీ విజయానికి దోహదపడాలంటూ కాంగ్రెస్‌‌ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కోరారు. అమేథీ ఓటర్లను ఉద్దేశించి ఆదివారం ఆమె ఓ వాయిస్‌‌ మెసేజ్ ను విడుదల చేశారు. బీజేపీ డబ్బులు పంచి ఓటర్లను ప్రభావితం చేస్తోందని ఆరోపించిన ప్రియాంక, ఎవరెన్ని చేసినా అమేథీ ప్రజల అభివృద్ధికి రాహుల్‌‌ పనిచేస్తూనే ఉంటారన్నారు.

 

 

 

 

 

Latest Updates