లండన్ బ్రిడ్జ్ పై కత్తి దూసింది పాకిస్తానీ

లండన్‌‌‌‌: లండన్‌‌‌‌ బ్రిడ్జ్‌‌‌‌ దగ్గర కత్తితో బీభత్సం సృష్టించి ఇద్దరిని చంపి, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని ఇస్లామిక్‌ టెర్రర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌కు చెందిన ఉస్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌గా పోలీసులు గుర్తించారు. కౌంటర్‌‌‌‌‌‌‌‌ టెర్రరిజమ్‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌ హెడ్‌‌‌‌గా ఉన్న ఇండియన్‌ సంతతికి చెందిన నీలీబసూ ఈ కేసు వివరాలను చెప్పారు. ఈ ఎటాక్‌‌‌‌కు కారణం, ప్లాన్‌‌‌‌కు సంబంధించి వివరాలపై దర్యాప్తు చేస్తున్నామని స్కాట్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ యార్డ్‌‌‌‌ యాంటీ టెర్రరిస్ట్‌‌‌‌ అధికారులు చెప్పారు. శుక్రవారం లండన్‌‌‌‌ బ్రిడ్జి దగ్గర్లోని ఫిష్‌‌‌‌మాంగర్స్‌‌‌‌ హాల్‌‌‌‌లో జరిగిన ఈవెంట్‌‌‌‌లో పాల్గొన్న ఖాన్‌‌‌‌ ఆ తర్వాత ఈ దాడి చేశాడన్నారు. లండన్‌‌‌‌ బ్రిడ్జి దగ్గర దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఇద్దరు చనిపోయారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్కాట్లాండ్‌‌‌‌ యార్డ్‌‌‌‌ పోలీసులు అతడిని కాల్చి చంపారు. లండన్‌‌‌‌ బ్రిడ్జిపై 2017లో కూడా టెర్రర్‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌ జరిగింది. బ్రిడ్జిపై ఐసిస్‌‌‌‌ టెర్రరిస్టులు వ్యాన్‌‌‌‌తో పాదచారులను ఢీకొట్టి, ఆ తర్వాత కత్తితో దాడి చేయడంతో 11 మంది చనిపోయారు.

అతడు యమడేంజర్‌

1990లో లండన్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్ఛ్సేంజ్‌‌‌‌పై బాంబులు వేసిన కేసులో ఉస్మాన్‌‌‌‌ను పోలీసులు అరెస్టు చేయగా.. 2012లో అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ యూకే కోర్టు తీర్పు చెప్పింది.2013లో కోర్టు ఆఫ్‌‌‌‌ అపీల్‌‌‌‌తో ఉస్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ శిక్షను 16 ఏండ్లకు పెంచి కచ్చితంగా ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించాలని, ఆ తర్వాత పెరోల్‌‌‌‌పై విడుదల అవ్వచ్చని చెప్పింది.

ఇస్లామిక్‌‌‌‌ టెర్రరిస్ట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌కు చెందిన ఉస్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ పాకిస్తాన్‌‌‌‌లో పెరిగాడు. అల్‌‌‌‌ఖైదా టెర్రర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఐడియాలజీకి ఇన్‌‌‌‌స్పైరై టెర్రరిస్ట్‌‌‌‌గా మారాడు. ఇంతకు ముందు కూడా టెర్రర్‌‌‌‌‌‌‌‌ ఎటాక్స్‌‌‌‌కు పాల్పడ్డాడు.1990లో లండన్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్స్ఛేంజ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌పై ఎటాక్‌‌‌‌ కేసులో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించి పోయిన డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో పెరోల్‌‌‌‌ లేదా లైసెన్స్‌‌‌‌పై బయటకి వచ్చాడు.  అప్పటి నుంచి స్టాన్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌లో ఉంటున్నాడు.   ముంబైలో జరిపిన దాడుల తరహాలో యూకే పార్లమెంట్‌‌‌‌పై ఎటాక్‌‌‌‌ చేయాలని ప్లాన్‌‌‌‌ చేశాడు. యూకేకి చెందిన కొంత మందికి పీవోకేలో టెర్రరిజంపై ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చే అంశాలపై కూడా ప్లాన్‌‌‌‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Latest Updates