ట్రావెల్​ ప్లాన్.. ఏ నెలలో ఏ టూర్..?

నచ్చిన ప్రదేశాలను చుట్టి రావాలని చాలామందికి ఉంటుంది. కానీ ‘టైం అంతా ఆఫీస్​, ఇంటితోనే గడిచిపోతుంది’ అని అంటుంటారు. టార్గెట్లు, పర్సనల్​​ గోల్స్​ అంటూ రొటీన్​గా బతికేస్తున్నారు. ఏదైనా సెలవు దొరికితే.. వేరే పనులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక ట్రావెలింగ్​ చేసే తీరిక ఎక్కడిది?. అందుకోసమే ఈ ట్రావెల్​ ప్లాన్​​ అందిస్తున్నాం. ఈ డేట్స్​​ను సేవ్​ చేసుకుంటే చాలు.. ఎంచక్కా ఫ్యామిలీతో టూర్​ను ఎంజాయ్​ చేయొచ్చు. ఒక్కో నెలా, ఒక్కో ప్లేస్​ను​ సెలెక్ట్​ చేసుకొని, జీవిత కాలానికి సరిపడే జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు.

ప్రయాణాలు.. కొత్త ఉత్సాహాన్నిస్తాయి. కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాయి. రొటీన్​ లైఫ్​ నుంచి బయటపడేలా చేస్తాయి. మనసుకు నచ్చిన ప్లేసుకు వెళ్తే.. జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. ప్రయాణాలు చేయాలని.. ప్రకృతితో మమేకం కావాలని చాలామందికి ఉంటుంది. కానీ బిజీ లైఫ్​ వల్ల అంత తీరిక ఉండదని చెప్తుంటారు. అలాంటివాళ్ల కోసమే ఈ ట్రావెల్​​ గోల్స్.

ఫిబ్రవరి

మరవంతే, కర్ణాటక

ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరాలనుకునేవాళ్లకు బెస్ట్​ ప్లేస్​ ఇది. ఇక్కడి బీచ్​లు ప్రత్యేక ఆకర్షణ. తెల్లటి ఇసుకతో బీచ్​లు ఆకర్షిస్తాయి. టూరిస్టులు ఇష్టపడే ఈ ప్లేస్​ ఉడిపి జిల్లాలో ఉంది. ఉడిపికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. మరవంతేకు వెళ్లే టూరిస్టులు కోడి బీచ్​ తప్పకుండా చూడాల్సిందే.

ప్లానింగ్​

ఫిబ్రవరి 21 శుక్రవారం : మహా శివరాత్రి (హాలిడే)

ఫిబ్రవరి 22 శనివారం : వీకెండ్​

ఫిబ్రవరి 23 ఆదివారం : వీకెండ్​

మార్చి

వెలాస్, మహారాష్ట్ర

మహారాష్ట్రలో ఆలివ్‌‌‌‌‌‌‌‌రిడ్లే తాబేళ్లను ఆదరించే గ్రామాలెన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైంది రత్నగిరి జిల్లాలోని వెలాస్. ఈ తాబేళ్లు వెలాస్ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. గ్రామస్తులు, జంతు ప్రేమికులు తాబేళ్ల రక్షణ బాధ్యత తీసుకుంటారు. మార్చి నెలంతా తాబేళ్ల పండుగ నిర్వహిస్తారు. ఈ గ్రామానికి సమీపంలో దివేఆగర్, ఆంజర్లే, హరిహరేశ్వర్ తీరాల్లోనూ తాబేళ్ల సందడి కనిపిస్తుంది. ఒడిశాలో గోపాల్‌‌‌‌పూర్ బీచ్ మొదలు, గంజాం సమీపంలోని గహిరమాతా బీచ్ వరకు ఆలివ్‌‌‌‌రిడ్లే తాబేళ్లు లక్షలుగా తరలివస్తాయి. పూనే నుంచి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వెలాస్​కు వెళ్లొచ్చు.

ప్లానింగ్​

మార్చి 7 శనివారం : వీకెండ్​

మార్చి 8 ఆదివారం : వీకెండ్​

మార్చి 9 సోమవారం : కాముడి దహనం (ఈ ఒక్క రోజు సెలవు పెట్టాలి)

మార్చి 10 మంగళవారం : హోలీ (హాలిడే)

ఏప్రిల్​

సంబర్ సాల్ట్ లేక్, రాజస్తాన్

మనదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది. జైపూర్​కు దగ్గరలో ఉంది. ఎటు చూసినా ఉప్పుతో కప్పి ఉంటుంది. కార్లు, బైక్​లు, సొంత వెహికిల్స్​తో లేక్ మొత్తం చుట్టిరావొచ్చు. అక్కడ పారాగ్లైడింగ్​ కూడా చేయొచ్చు. ఈ ట్రిప్​ ప్లాన్​ చేసుకుంటే రాజస్తాన్​లోని మరికొన్ని ప్లేసులను చూసిరావొచ్చు.

ప్లానింగ్​

ఏప్రిల్​ 2 గురువారం : రామ నవమి (హాలిడే)

ఏప్రిల్​ 3 శుక్రవారం : (సెలవు పెట్టాలి)

ఏప్రిల్​ 4 శనివారం : వీకెండ్​

ఏప్రిల్​ 5 ఆదివారం : వీకెండ్​

ఏప్రిల్​ 6 సోమవారం : మహవీర్​ జయంతి (హాలిడే)

అలాగే ఏప్రిల్​10 శుక్రవారం : గుడ్​ ఫ్రైడే (హాలిడే)

ఏప్రిల్​11 శనివారం : వీకెండ్​

ఏప్రిల్​12 ఆదివారం : వీకెండ్​

మే

లాంగ్వా, నాగాలాండ్‌‌‌‌

నాగాలాండ్​ మోన్ జిల్లాలో అతిపెద్ద గ్రామం ఇది. చాలా ఇంట్రెస్టింగ్​ ప్లేస్​. కొన్యాక్​ నాగాలాకు ప్రసిద్ధి. పచ్చబొట్టు పొడిచిన ముఖాలు, ఈకలను ధరించిన మనుషులు ఉంటారు. వీళ్ల వేషధారణ విచిత్రంగా ఉంటుంది. ఏప్రిల్​, మే నెలలో ‘ఆవోలింగ్​ మున్యూ’ అనే పండుగ జరుగుతుంది. ఆ టైంలో ఎక్కడ చూసిన కొన్యాక్​ నాగాల సందడి ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వస్తువులు డిఫరెంట్​గా ఉంటాయి. మయన్మార్​ తెగకు చెందినవాళ్లు కూడా కనిపిస్తారు.

ప్లానింగ్​

మే 1 శుక్రవారం : లేబర్​ డే (హాలిడే)

మే 2 శనివారం : వీకెండ్​

మే 3 ఆదివారం : వీకెండ్​

ఆ తరువాత

మే 7 గురువారం : బుద్ధ పూర్ణిమ (హాలిడే)

మే 8 శుక్రవారం : సెలవు పెట్టాలి

మే 9 శనివారం : వీకెండ్​

మే 10 ఆదివారం : వీకెండ్​జులై

సౌర్ గ్రామం, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్​ అనగానే హిమాలయాలు గుర్తొస్తాయి. ఒక్కసారి ఈ ట్రిప్​ ప్లాన్​ చేసుకుంటే జీవితకాలమంతా ఎన్నో అనుభూతులు సొంతం అవుతాయి. ట్రెక్కింగ్​, దట్టమైన అడవులు, అరుదైన జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. సౌర్​ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. దీనికి ‘ఘోస్ట్​ విలేజ్’​గా పేరుంది. మూడు వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ ఊరు ఉందట. అలాంటి విలేజ్​ను కొంతమంది ఆర్టిస్ట్​లు ఆకర్షణీయమైన బొమ్మలు వేసి, గ్రామాన్ని అందంగా మార్చారు.

ప్లానింగ్​

జులై 31 శుక్రవారం : బక్రీద్​ (హాలిడే)

ఆగస్టు 1 శనివారం : వీకెండ్​

ఆగస్టు 2 ఆదివారం : వీకెండ్​

ఆగస్టు 3 సోమవారం : రక్షాబంధన్​

ఆగస్టు

లెప్చజగట్, పశ్చిమ బెంగాల్

ఇది డెహ్రడూన్​కు దగ్గరలో ఉంది. డెహ్రాడూన్​ నుంచి గంటసేపు సాగే జర్నీ ఎంతో థ్రిల్​ ఇస్తుంది. ఇది ఎత్తయిన హిల్​స్టేషన్​ కూడా. ఇక్కడి టాయ్​ ట్రైన్​​​ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటుంది.

ప్లానింగ్​

ఆగస్టు 29 శనివారం : వీకెండ్​ (మొహర్రం)

ఆగస్టు 30 ఆదివారం : వీకెండ్​

ఆగస్టు 31 సోమవారం : ఓనమ్​ పండుగ (కేరళ వాళ్లు కాకుండా మిగతావాళ్లు సెలవు పెట్టాలి)

అక్టోబర్​

వట్టకనాల్, తమిళనాడు

దట్టమైన అడవులు, కొండలు, గుట్టల మధ్య విహరించాలని ఉంటే.. వట్టకనాల్​కు వెళ్లాల్సిందే. దీనికి ‘మినీ ఇజ్రాయిల్​’​ అని పేరుంది. ఇక్కడ ‘డాల్ఫిన్​ నోస్​’ అనే ప్లేస్​ బాగా ఫేమస్​. ఈ ట్రిప్​ను ప్లాన్​ చేసుకుంటే టెక్కింగ్​తోపాటు వాటర్​ఫాల్స్​ను కూడా చూడొచ్చు.

ప్లానింగ్​

అక్టోబర్​ 2 శుక్రవారం : గాంధీ జయంతి (హాలిడే)

అక్టోబర్​ 3 శనివారం : వీకెండ్​

అక్టోబర్​ 4 ఆదివారం : వీకెండ్​

ఆ తరువాత

అక్టోబర్​ 24 శనివారం : వీకెండ్​

అక్టోబర్​ 25 ఆదివారం : దసరా

నవంబర్​

కద్మత్ ద్వీపం, లక్ష్వదీప్

పచ్చదనంతో కనిపించే కొబ్బరిచెట్లు.. అలలపై తేలియాడే బోట్లు… ఆకట్టుకునే ఇసుక తిన్నెలు కద్మత్​ ద్వీపం సొంతం. చాలామందికి ఫేవరెట్​ డెస్టినేషన్​ ఇది. ఒకసారి కద్మత్​ ద్వీపానికి వెళ్తే.. బోలెడు బీచ్​లను చుట్టిరావొచ్చు. లక్షద్వీప్​కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కద్మత్​లో బీచ్​ రిసార్ట్​లు కూడా ఉన్నాయి.

ప్లానింగ్​

నవంబర్​ 13 శుక్రవారం : ధన్​తేరస్​

నవంబర్​ 14 శనివారం : వీకెండ్​

నవంబర్​ 15 ఆదివారం : వీకెండ్​

డిసెంబర్​

ఆలి, ఉత్తరాఖండ్

ఇక్కడి ఇళ్లు, చెట్లు, కొండలపై దట్టమైన మంచు.. థ్రిల్​కు గురిచేసే రోప్​వేలతో వెల్​కమ్​ చెప్తుంది. ప్రకృతి ప్రేమికులు ఆలి దృశ్యాలను చూసేందుకు ముచ్చటపడతారు.

ప్లానింగ్​

డిసెంబర్​ 25 శుక్రవారం : క్రిస్మస్​ (హాలిడే)

డిసెంబర్​ 26 శనివారం : వీకెండ్​

డిసెంబర్​ 27 ఆదివారం వీకెండ్​

see also: సూర్యగ్రహణం ఎఫెక్ట్ : చూపు పోగొట్టుకున్నారు

దివ్యాంగురాలిని వరించిన అదృష్టం

చిన్నతనంలో నాపై రేప్ జరిగింది

Latest Updates