రికార్డ్.. అంతరిక్షంలో 289 రోజులు

ఒకే మిషన్ లో ఎక్కువకాలం అంతరిక్షంలో ఉన్న ఫిమేల్ ఆస్ట్రోనాట్ గా నాసా ఫ్లైట్ ఇంజనీర్ క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. శనివారం నాటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్​లో 289 రోజులను పూర్తి చేసుకొని పెగ్గీ విట్సన్​ పేరిట ఉన్న రికార్డును (288 రోజులు) కోచ్​ బ్రేక్​ చేశారు. మార్చి14న అంతరిక్షానికి వెళ్లిన కోచ్​.. 2020 ఫిబ్రవరి 6న భూమిపైకి తిరిగి రానున్నారు. అక్టోబర్ లో నాసా ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్ తో కలిసి స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా.. ఫస్ట్ ఆల్ ఉమెన్ స్పేస్ వాక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.

Latest Updates