కంగ‌నాను ఆమె ప్ర‌త్య‌ర్ధులు హ‌త‌మార్చుతారేమో : ఎమ్మెల్యే లేఖ

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా రనౌత్ ను ప్ర‌త్య‌ర్ధులు హ‌త‌మార్చుతారంటూ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ కేంద్ర‌హోమంత్రి అమిత్ షా కు లేఖ రాశారు.

కాశ్మీర్ లో ఓ స‌మ‌స్య‌ల‌పై తాను వ్యాఖ్య‌లు చేశాన‌ని, ఆ వ్యాఖ్య‌ల కార‌ణంగా ఒక‌టిన్న‌ర నెల‌లుగా త‌న‌కు అంత‌ర్జాతీయంగా బెదిరింపు కాల్స్ ఎక్కువ‌య్యాయ‌య‌ని, బెదిరింపు కాల్స్ వెన‌క దావూద్ ఇబ్ర‌హీం కంపెనీ ఉన్న‌ట్లు తాను న‌మ్ముతాన‌ని అమిత్ షాకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

మ‌రోవైపు ముంబై పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కంగన ఆమె ప్ర‌త్య‌ర్ధులు హ‌త‌మార్చుతార‌ని అన్నారు. పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్‌ను నిషేధించాలని తాను ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించానని గుర్తు చేశారు. ఎందుకంటే దాని ద‌ర్శ‌క నిర్మాత‌లు చ‌ట్ట‌విరుద్దంగా త‌న క్యార‌క్ట‌ర్ ను బ్యాడ్ గా చిత్రీక‌రించార‌ని అన్నారు. వెబ్ సిరీస్ లో ఒక అవినీతి పాత్రలో కాశ్మీర్లో ఏదో ఒక సమస్యపై తాను వివాదాస్ప‌దంగా వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చిత్రీక‌రించార‌ని , అప్ప‌టి నుంచే బెదిరింపు కాల్స్ ఎక్కువ‌య్యాయ‌ని, ఆదారాల‌తో స‌హా కేసు న‌మోదు చేయించిన‌ట్లు చెప్పారు.

అదే లేఖ‌లో కంగన గురించి స్పందించిన గుర్జార్ ఆమెకు వై కేటగిరీకి బదులుగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల‌ని కోరారు. మ‌మ‌రాష్ట్ర ప్ర‌భుత్వం దావుద్ ఇబ్ర‌హీంతో చేతులు క‌లిపింద‌ని ఆరోపించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ -కాంగ్రెస్-శివసేన ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలనను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దావూద్ యొక్క డి కంపెనీ నియంత్రిస్తోందని ఆయన ఆరోపించారు.

కంగనా రనౌత్ వివాదంపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, పారిపోయిన ఇస్లామిక్ పండితుడు జాకీర్ నాయక్ లకు చెందిన అక్రమ భవనాలను కూల్చివేసేందుకు ఎందుకు ధైర్యం చేయ‌లేద‌ని అన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే డమ్మీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని, కంగనా రనౌత్ మరియు తనను వ్యతిరేకించే వారందరి నుంచి కాపాడాల‌న్న యూపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ `సనాతన్ ధర్మం’ను కూడా చెడుగా చిత్రీకరించారు. సీబీఐ విశ్వసనీయతను ప్రశ్నించారు. ఈ సిరీస్‌ను నిషేధించాలని కోరుతూ నేను ప్రభుత్వానికి లేఖ రాశాను, ఈ సిరీస్‌ను రూపొందించడం వెనుక డి-కంపెనీ ఉందని యూపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

Latest Updates