మీతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల హ్యారిస్ కు విషెస్ తెలిపారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ. అధ్యక్షుడిగా సక్సెస్ ఫుల్ గా పాలన కొనసాగించాలని ఆకాంక్షించారు రామ్ నాథ్ కోవింద్. ఇండియా-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా కలిసి పనిచేస్తామన్నారు. బిడెన్, కమల హ్యరిస్ కు వెంకయ్యనాయుడు నాయుడు  శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇండియా-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆకాంక్షించారు. ప్రపంచాన్ని మరింత శాంతియుతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

భారత్ -అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. మీ విజయం భారతీయ అమెరికన్లందరికీ గర్వకారణమంటూ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ను కూడా అభినందించారు మోడీ. హారిస్ మద్దతుతో భారత్ -అమెరికా సంబందాలు మరింత బలపడ్తాయని ట్వీట్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం బిడెన్, హారిస్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధికి అమెరికా – భారత్ కలిసి కృషి చేద్దామని ట్వీట్ చేశారు.

Latest Updates