న్యూజిలాండ్ ప్రధాని జెసిండాకు మోడీ విషెస్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ దేశ ప్రస్తుత ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్‌‌కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా జెసిండాతో కలసి పని చేయడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. శనివారం న్యూజిలాండ్‌‌లో జరిగిన ఎన్నికల్లో జెసిండా నాయకత్వంలోని లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో చారిత్రాత్మక విక్టరీ కొట్టింది.

Latest Updates