ఆసీస్ టూర్‌‌కు సూర్యకుమార్‌‌ను సెలెక్ట్ చేయాల్సింది

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్న సుదీర్ఘ సిరీస్ త్వరలో షురూ కానుంది. ఈ టోర్నీ కోసం జంబో టీమ్‌‌‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. ఐపీఎల్‌‌లో, దేశవాళీలో రాణించిన సూర్యకుమార్ యాదవ్‌‌‌ను మాత్రం సెలెక్ట్ చేయలేదు. టీమ్‌‌లో తనను ఎంపిక చేయకపోవడం పై సూర్యకుమార్ రీసెంట్‌‌గా స్పందించాడు. అది తనను చాలా బాధించిందన్నాడు. తాజాగా ఈ విషయంపై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కామెంట్ చేశాడు.

ఆస్ట్రేలియా టూర్‌‌కు సూర్యను సెలెక్ట్ చేయకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని లారా తెలిపాడు. ‘ఆసీస్‌‌ టూర్‌‌‌లో సూర్యకుమార్‌‌ను ఆడించాల్సింది. అతడో క్లాస్ ప్లేయర్. రన్స్ చేసే ప్లేయర్లనే కాకుండా.. టెక్నిక్, ఒత్తిడిలో ఆడే సామర్థ్యం, ఏ పొజిషన్‌‌లోనైనా బ్యాటింగ్ చేసే వారిని నేను గమనిస్తుంటా. ముంబైకి టైటిల్ రావడంలో సూర్య కీలకపాత్ర పోషించాడు. నంబర్ 3 పొజిషన్‌‌లో అతడు అదరగొట్టాడు. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ తర్వాత అతడు బ్యాటింగ్‌‌కు దిగి రాణించాడు. ఏ క్రికెట్‌‌లోనైనా ఈ స్థానంలో వచ్చే ప్లేయర్‌‌ను బెస్ట్ ఆటగాడిగా చెబుతారు. ఇలాంటి ప్లేయర్‌‌‌పై నమ్మకం ఉంచాలి’ అని లారా పేర్కొన్నాడు.

Latest Updates