ఏపీలో అతిపెద్ద మట్టి గాజుల గణేశ్

వినాయక చవితి సందర్భంగా డిఫరెంట్ గణపతి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మట్టి విగ్రహాలు, కూరగాయలు, కొబ్బరికాయలు, పండ్లు,ఇలా పలు రూపాల్లో గణేశ్ విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. తిరుపతిలోని తుమ్మలగుంటలో చేసిన అతిపెద్ద మట్టిగాజుల వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహానికి  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలి పూజ చేశారు.

ఈ విగ్రహానికి సుమారు 2 లక్షల మట్టి గాజులతో తయారు చేశారు. 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో విగ్రహం ఉంది.ఈ విగ్రహాన్ని బాహుబలి సినిమాకు సెట్టింగులుకు పనిచేసిన దాదాపు 30 మంది కళాకారులు 17 రోజులపాటు తయారు చేశారు.  ముస్లిం సోదరులు అష్రఫ్, షరీఫ్ తయారు చేసిన 1,116 కేజీల భారీ లడ్డును స్వామివారికి మొట్టమొదటి నైవేద్యంగా సమర్పించారు అర్చకులు.

 

Latest Updates