శ్రీరాముడు ముస్లింలకూ పూర్వీకుడే : రాందేవ్ బాబా

అహ్మదాబాద్: శ్రీరాముడు హిందూవులతో పాటు ముస్లింలకూ పూర్వీకుడేనని బాబా రామ్ దేవ్ అన్నారు. నదియాడ్ లో యోగా కార్యక్రమానికి హాజరైన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరం కడితే, దేశ గౌరవం మరింత పెంచినట్లు అవుతుందన్నా రు. మందిర నిర్మా ణానికి ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధంలేదన్నారు. ‘రామ మందిరాన్ని అయోధ్యలో కాకపోతే ఎక్కడ కడతారు? మక్కా, మదీనా లేదా వాటికన్ సిటీలో రాముడి గుడిని కట్టరు కదా”అని తెలిపారు.

Latest Updates